చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగు తూనే ఉంది. ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. అటు క్రికెటర్లను వదలడం లేదు ఈ కరోనా మహమ్మారి.
read also : మంత్రి హరీష్ రావుపై ఈటల ఫైర్..
తాజాగా జూలై 8 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ జట్టులో కరోనా కలకలం రేపింది. ఆ జట్టులోని ముగ్గురు క్రికెటర్లకు కరోనా సోకింది. ముగ్గురు క్రికెటర్లతో పాటు నలుగురు సహాయక సిబ్బందికి ఈ మహమ్మారి సోకింది. దీంతో ఇంగ్లాండ్ జట్టులో కలకలం రేగింది. దీంతో పాక్ తో సిరీస్‌కు ఎంపికైన జట్టును కాకుండా పూర్తిగా కొత్త జట్టును ఎంపిక చేసిన ఇంగ్లాండ్ బోర్డు.. కెప్టెన్ గా బెన్ స్టోక్స్ ను నియమించింది.
