NTV Telugu Site icon

Sehwag: జడేజాకు కెప్టెన్సీ ఇచ్చి పెద్ద తప్పు చేశారు

Sehwag

Sehwag

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శనపై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. జడేజాను కెప్టెన్‌గా చేయడమే చెన్నై టీమ్ చేసిన పెద్ద తప్పు అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ధోనీ స్థానంలో జడేజాకు కెప్టెన్సీ ఇవ్వాలని మేనేజ్‌మెంట్ భావించినప్పుడు ఈ సీజన్ మొత్తానికి జడేజానే కొనసాగించాల్సిందని సెహ్వాగ్ అన్నాడు. అయితే టోర్నీ మధ్యలో మళ్లీ కెప్టెన్సీని ధోనీకి అప్పగించడం సరికాదని పేర్కొన్నాడు. అటు తుది జట్టులోని 11 మంది ఆటగాళ్లను పదే పదే మార్చుతుండటాన్ని కూడా సెహ్వాగ్ తప్పుపట్టాడు.

చెన్నై జట్టులో ఈ సీజన్‌లో సెటిల్ ప్లేయర్ అంటూ ఎవరూ కనిపించడం లేదని సెహ్వాగ్ ఆరోపించాడు. ఓపెనర్ గైక్వాడ్ ఆరంభ మ్యాచ్‌లలో దారుణంగా ఆడాడని.. సరిగ్గా పరుగులు చేయలేకపోయాడని.. మిగతా బ్యాటర్లు కూడా రాణించింది అంతంతమాత్రంగానే అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఒక మ్యాచ్‌లో ధోనీ స్కోర్ చేస్తే, మ‌రో మ్యాచ్‌లో గైక్వాడ్ స్కోర్ చేశాడని, ఇంకో మ్యాచ్‌లో ధోనీ చివ‌ర్లో బౌండ‌రీలు కొట్టినా ప్రయోజనం చేకూరలేదన్నాడు. ధోనీ ముందు నుంచి కెప్టెన్‌గా ఉండి ఉంటే చెన్నై ఇన్ని మ్యాచ్‌లు ఓడిపోయేది కాదన్నాడు. కాగా ఈ టోర్నీలో చెన్నై సూపర్‌కింగ్స్ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడగా వాటిలో ఏడు మ్యాచ్‌లలో ఓడిపోయి కేవలం మూడు మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది.

IPL 2022: సన్‌రైజర్స్‌పై వార్నర్ ప్రతీకారం తీర్చుకుంటాడా?