NTV Telugu Site icon

CWC Qualifiers 2023: వన్డేల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ.. జింబాబ్వే ప్లేయర్ అరుదైన రికార్డు!

Untitled Design (2)

Untitled Design (2)

Sean Williams Hits Fastest Century For Zimbabwe In ODIs: జింబాబ్వే ఆటగాడు సీన్‌ విలియమ్స్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వే తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేశాడు. వన్డే ప్రపంచకప్‌ 2023 క్వాలిఫయర్స్‌లో (CWC Qualifiers 2023) భాగంగా నేపాల్‌తో ఆదివారం (జూన్ 18) జరిగిన మ్యాచ్‌లో విలియమ్స్‌ ఈ రికార్డు సాధించాడు. 70 బంతుల్లో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విలియమ్స్‌ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 1 సిక్సర్‌ ఉన్నాయి. ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన విలియమ్స్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

నిన్నటివరకు జింబాబ్వే తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేసిన రికార్డు రెగిస్‌ చకబ్వా పేరిట ఉంది. 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో చకబ్వా 73 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ రికార్డును సీన్‌ విలియమ్స్‌ బద్దలు కొట్టాడు. జింబాబ్వే తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా బ్రెండన్‌ టేలర్‌ ఉన్నాడు. 2015లో ఐర్లాండ్‌పై 79 బంతుల్లో శతకం చేశాడు. ఈ జాబితాలో సికందర్‌ రజా (2022లో బంగ్లాదేశ్‌పై 81 బంతుల్లో) నాలుగో స్థానంలో ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా వన్డేల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేసిన రికార్డు ఏబీ డివిలియర్స్ పేరుపై ఉంది. ఏబీ 31 బంతుల్లోనే సెంచరీ బాదాడు.

Also Read:
Ashes 1st Test: ఇదేం ఫీల్డింగ్ రా బాబు.. ఇలాంటిది నేనెక్కడ చూడలేదు..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నేపాల్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. కుశాల్‌ భూర్టెల్‌ (99) తృటిలో సెంచరీ మిస్ చేసుకోగా.. ఆసిఫ్‌ షేక్‌ (66), కుశాల్‌ మల్లా (41), రోహిత్‌ పౌడెల్‌ (31) రాణించారు. అనంతరం బరిలోకి దిగిన జింబాబ్వే మరో 35 బంతులు మిగిలుండగానే 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. సీన్‌ విలియమ్స్‌తో పాటు క్రెయిగ్‌ ఎర్విన్‌ (121 నాటౌట్; 128 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో చెలరేగాడు.

Show comments