2025-26 యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్‌బోర్న్ వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. బాక్సింగ్ డే టెస్ట్ మొదటి రోజు ఆటలో ఏకంగా 20 వికెట్లు నేలకూలాయి. ఆతిథ్య ఆసీస్ 45.2 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్ 29.5 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌట్ అయింది. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు 20 వికెట్లు పడటం ఇదే మొదటిసారి. అయితే ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్‌తో పాటు స్కాట్ బోలాండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. రెగ్యులర్ ఓపెనర్ జేక్ వెదర్‌రాల్డ్ బదులుగా.. 11వ నంబర్ ఆటగాడు బోలాండ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించడం విశేషం. బోలాండ్ బ్యాటింగ్‌కు వస్తున్న సమయంలో ఆసీస్ ప్రేక్షకులు చప్పట్లతో స్వగతం పలికారు. ఓపెనర్‌గా బోలాండ్ ఆడుతాడని ఎవరూ ఊహించి ఉండరు. అంతకు కొన్ని నిమిషాల ముందు, అతడు మూడు వికెట్లు పడగొట్టాడు. ఆ వెంటనే బ్యాటింగ్‌కు దిగాడు. ఆరు బంతులు ఆడిన బోలాండ్ డకౌట్ అయ్యాడు. బోలాండ్ అవుట్ అనంతరం వెదర్‌రాల్డ్ బ్యాటింగ్‌కు వచ్చాడు. బోలాండ్ ఓపెనర్‌గా రావడంపై నెటిజెన్స్ విమర్శలు చేస్తున్నారు. ఆస్ట్రేలియాది వ్యూహమా? లేదా బలుపా? అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: The Raja Saab-Prabhas: మూడేళ్ల తర్వాత.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 132 పరుగులకు ఆలౌట్ అయింది. 46 రన్స్ చేసిన ట్రావిస్ హెడ్ టాప్ స్కోరర్. స్టీవ్ స్మిత్ (24), కామెరూన్ గ్రీన్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ అందుకున్నారు. బ్రైడాన్ కార్స్ 4, బెన్ స్టోక్స్ 3, జోష్ టంగ్ 2, గస్ అట్కిన్సన్ 1 వికెట్ పడగొట్టారు. ఇంగ్లాండ్ విజయం దిశగా దూసుకెళుతోంది. రెండో రోజు ఆటలో 18 ఓవర్లలో 2 వికెట్లకు 111 రన్స్ చేసింది. ఇంకా 64 రన్స్ చేస్తే ఇంగ్లాండ్ విజయం సాధిస్తుంది. 5న టెస్ట్‌లలో ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆసీస్ సిరీస్‌ను సొంతం చేసుకుంది.
