Scotland Squad: కొత్త కోచ్, కొత్త ఆశలు.. టీ20 వరల్డ్‌కప్‌కు స్కాట్లాండ్ జట్టు ఇదే, టాప్ జట్లకు షాక్ ఇస్తుందా?
- బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ ఎంట్రీ
- 15 మందితో కూడిన జట్టును ప్రకటించిన స్కాట్లాండ్
- కొత్త కోచ్, కొత్త ఆశలతో స్కాట్లాండ్
- టాప్ జట్లకు స్కాట్లాండ్ షాక్ ఇస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 వరల్డ్‌కప్ 2026కు స్కాట్లాండ్ జట్టు సిద్ధమైంది. మరికొద్ది రోజుల్లో ఆరంభమయ్యే మెగా టోర్నమెంట్ కోసం స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఈరోజు అధికారికంగా ప్రకటించింది. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్‌కప్‌లో కూడా స్కాట్లాండ్ పాల్గొనగా.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈసారి అనుభవం, యువత కలయికతో కూడిన స్క్వాడ్‌ను ఎంపిక చేసి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాలనే లక్ష్యంతో స్కాట్లాండ్ బరిలోకి దిగుతోంది. కొత్త హెడ్ కోచ్ ఓవెన్ డాకిన్స్ మార్గదర్శకత్వంలో కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్ జట్టును ముందుకు నడిపించనున్నాడు. టోర్నీ నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడంతో స్కాట్లాండ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
బ్యాటింగ్‌లో జార్జ్ మున్సీ, రిచీ బెర్రింగ్టన్ లాంటి పవర్ హిట్టర్లు కీలక పాత్ర పోషించనున్నారు. ఆల్రౌండర్లుగా క్రిస్ గ్రీవ్స్, మెక్‌ముల్లెన్ జట్టుకు అందుబాటులో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో మార్క్ వాట్, సఫ్యాన్ షరీఫ్, బ్రాడ్లీ వీల్లపై స్కాట్లాండ్ భారీ ఆశలు పెట్టుకుంది. ఆఫ్ఘాన్‌లో జన్మించిన ఫాస్ట్ బౌలర్ జైనుల్లా ఇహ్సాన్ తొలిసారి స్కాట్లాండ్ జట్టుకు ఎంపికయ్యాడు. ఇటీవలే స్కాట్లాండ్ తరఫున ఆడేందుకు అర్హత సాధించిన అతడిపై టీమ్ మేనేజ్మెంట్ భారీ ఆశలు పెట్టుకుంది. మాజీ న్యూజిలాండ్ ఆటగాడు టామ్ బ్రూస్ కూడా స్క్వాడ్‌లో చోటు సంపాదించుకున్నాడు.
Also Read
- Vaibhav Sooryavanshi: అప్పుడే వైభవ్ సూర్యవంశీకి ప్రమోషన్.. వైస్ కెప్టెన్‌గా ఎంపిక..
- Mohammed Shami: రంజీల్లో రికార్డులు కొట్టినా లభించని చోటు.. షమీకి భారీ ఎదురుదెబ్బ..
- WTC Points Table: కర్మ తిరగబడింది.. వెస్టిండీస్ దెబ్బకి కుప్పకూలిన పాకిస్థాన్ ఆశలు..
- Vaibhav Sooryavanshi: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రాకెట్ వేగంతో దూసుకెళ్లిన వైభవ్.. ఏకంగా 230 స్థానాలు జంప్..
రిజర్వ్ ఆటగాళ్లుగా జాస్పర్ డేవిడ్సన్, జాక్ జార్విస్లను ఎంపిక చేయగా.. నాన్-ట్రావెలింగ్ రిజర్వ్‌లుగా మాకెంజీ జోన్స్, క్రిస్ మెక్‌బ్రైడ్, చార్లీ టియర్‌ను ఎంపిక చేశారు. ఇటీవల అంతర్జాతీయ టీ20ల్లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న స్కాట్లాండ్, ఈ వరల్డ్‌కప్‌లో కూడా పెద్ద జట్లకు షాకులు ఇవ్వాలనే ధీమాతో ఉంది. ఈ 15 మంది స్క్వాడ్‌తో స్కాట్లాండ్ టీమ్ టోర్నమెంట్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. మెగా టోర్నమెంట్లో స్కాట్లాండ్ గ్రూప్ ‘సి’లో ఉంది. ఈ గ్రూప్‌లో ఇంగ్లాండ్, ఇటలీ, నేపాల్, వెస్ట్ ఇండీస్ జట్లు ఉన్నాయి. స్కాట్లాండ్ తమ తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో ఆడనుంది.
Also Read: T20 World Cup 2026: మెంటలెక్కించే బ్యాటింగ్ లైనప్‌లు.. టీ20 వరల్డ్‌కప్‌ను కొట్టేది ఈ జట్లేనా?
స్కాట్లాండ్ స్క్వాడ్:
రిచీ బెర్రింగ్టన్ (కెప్టెన్), టామ్ బ్రూస్, మాథ్యూ క్రాస్, బ్రాడ్లీ కరీ, ఒలివర్ డేవిడ్సన్, క్రిస్ గ్రీవ్స్, జైనుల్లా ఇహ్సాన్, మైకేల్ జోన్స్, మైకేల్ లీస్క్, ఫిన్లే మెక్రెత్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, జార్జ్ మున్సీ, సఫ్యాన్ షరీఫ్, మార్క్ వాట్, బ్రాడ్లీ వీల్.
రిజర్వ్ ఆటగాళ్లు: జాస్పర్ డేవిడ్సన్, జాక్ జార్విస్.
నాన్-ట్రావెలింగ్ రిజర్వ్‌లు: మాకెంజీ జోన్స్, క్రిస్ మెక్‌బ్రైడ్, చార్లీ టియర్.
తాజావార్తలు
-
Pallaburusu Teaser: నాగ చైతన్య చేతుల మీదుగా ‘పళ్ళబురుసు’ టీజర్ విడుదల.. పల్లె నేపథ్యంలో వినోదానికి గ్యారంటీ!
-
US Iran War: జోర్డాన్ దాడికి ప్రతీకారం.. ఇరాన్‌పై అమెరికా దాడులు..
-
Astrology: జూలై 30 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!