NTV Telugu Site icon

ఒలింపిక్స్‌… ముగిసిన సతీష్‌ కుమార్‌ పోరాటం..

Satish Kumar

Satish Kumar

ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌ విభాగంలో పతకం ఖాయం అనే రీతిలో ఆశలు రేపిన భారత బాక్సర్‌ సతీష్ కుమార్‌ నిరాశపర్చాడు.. ప‌త‌కానికి మరో అడుగు దూరంలోనే తన పోరాటాన్ని ముగించాడు.. 91 కిలోల సూప‌ర్ హెవీ వెయిట్ కేట‌గిరీలో ఇవాళ జరిగిన క్వార్టర్‌ఫైన‌ల్ మ్యాచ్‌లో ఉజ్బెకిస్థాన్ బాక్సర్, వ‌ర‌ల్డ్ నంబ‌ర్ వ‌న్‌ జ‌ల‌లోవ్ బ‌ఖోదిర్ తో తలపడిన స‌తీష్‌కుమార్‌.. 0-5తో ఓటమిపాలయ్యారు..

తొలి రౌండ్ నుంచే స‌తీష్‌పై పూర్తిగా పైచేయి సాధించారు జ‌ల‌లోవ్‌… ప్రతి రౌండ్‌లోనూ జ‌డ్జీలు జ‌ల‌లోవ్ వైపే మొగ్గుచూపారు. ప్రత్యర్థి విసిరిన బ‌ల‌మైన పంచ్‌ల ముందు స‌తీష్ నిలవడమే కొన్నిసార్లు కష్టంగా మారిపోయింది. భారత బాక్సర్ మొత్తంగా 27 పాయింట్లు సాధించగా.. అటు ప్రత్యర్థి బఖోదిర్ 30 పాయింట్లు సాధించాడు. సతీష్ ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌కు వెళ్తే, భారత్‌కు మరో పతకం ఖాయం అంతా ఎదురుచూశారు.

Show comments