FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్‌లో భారత సంతతి ఆటగాడి రికార్డ్..
- ఫిఫా వరల్డ్‌కప్ మ్యాచ్‌ను ప్రారంభించిన తొలి భారత సంతతి ప్లేయర్‌గా సర్ప్రీత్ సింగ్ రికార్డు.
- న్యూజిలాండ్ తరఫున ఇరాన్‌పై స్టార్టింగ్ ఎలెవన్‌లో చోటు.
- పంజాబీ మూలాలున్న సర్ప్రీత్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్ 2026లో అరుదైన ఘనత చోటుచేసుకుంది. ఫిఫాలో స్టార్టింగ్ ఎలెవన్‌లో ఆడిన తొలి భారత మూలాలున్న ఫుట్‌బాలర్‌గా సర్ప్రీత్ సింగ్ రికార్డుకెక్కారు. న్యూజిలాండ్ తరుపున ఈయన బరిలో దిగారు. ఇరాన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్టింగ్ ఎలెవన్‌లో చోటుదక్కించుకుని, మ్యాచ్‌ను ఆరంభించిన తొలి ఆటగాడిగా నిలిచారు. ఆక్లాండ్‌లో పంజాబీ తల్లిదండ్రులకు జన్మించిన 27 ఏళ్ల సర్ప్రీత్ న్యూజిలాండ్ టీమ్‌లో మిడ్‌ఫీల్డర్‌గా బరిలోకి దిగాడు. ఇరాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దాదాపుగా పూర్తి సమయం గ్రౌండ్ లోనే ఉన్నాడు.
సర్ప్రీత్ 2019లో జర్మనీ దిగ్గజ క్లబ్ బయోర్న్ మ్యూనిక్ తరుఫున బుండెస్లిగాలో ఆడిన తొలి భారతీయ మూలాలు ఉన్న ఆటగాడిగా పేరుత తెచ్చుకున్నాడు. నిజానికి సర్ప్రీత్ భారత అభిమానులకు కొత్త కాదు. 2018లో ముంబైలో జరిగిన ఇంటర్కాంటినెంటల్ కప్‌లో న్యూజిలాండ్ అండర్ 23 జట్టు తరుఫున భారత్‌పై ఆడాడు. ఆ టోర్నీలో కెన్యాపై గోల్ చేయడంతో పాటు భారత్‌పై విజయాన్ని అందించారు.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ఇదే ఫిఫా వరల్డ్ కప్‌లో మరో భారతీయ మూలాలు ఉన్న ఆటగాడు నిషాన్ వెలుపిళ్లై ఆస్ట్రేలియా తరుఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఫ్రాన్స్ మాజీ మిడ్‌ఫీల్డర్ వికాష్ ధోరాసూ మాత్రమే భారత సంతతి నుంచి వరల్డ్ కప్‌లో ఆడిన ఆటగాడిగా గుర్తింపు పొందగా, ఇప్పుడు సర్ప్రీత్ స్టార్టింగ్ ఎలెవన్‌లో చోటు సంపాదించడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించాడు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!