Site icon NTV Telugu

Sara Tendulkar: అరుదైన ఫొటోలు షేర్ చేసిన సారా టెండూల్కర్

Saratendulkar

Saratendulkar

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్-సానియాల వివాహం మార్చి 5న జరిగింది. ముంబైలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఈ వివాహానికి సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. చాలా గ్రాండ్‌గా వివాహ వేడుకలు జరిగాయి. తాజాగా అందుకు సంబంధించిన అరుదైన ఫొటోలను సోదరి సారా టెండూల్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ప్రస్తుతం ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

వివాహానికి సంబంధించిన వేడుకలు ఎంతో గ్రాండ్‌గా నిర్వహించినట్లుగా వార్తలు వచ్చాయి. సంప్రదాయాల మధ్య, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. తాజాగా అర్జున్ సోదరి సారా టెండూల్కర్ ఈ వేడుకకు సంబంధించిన అరుదైన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్న ఫొటోలు, వివాహ వేడుకలోని ఆనందకర క్షణాలు ఈ చిత్రాల్లో కనిపిస్తున్నాయి. సారా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఫొటోలను పెద్ద ఎత్తున షేర్ చేస్తూ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Exit mobile version