Sanjay Manjrekar: భువనేశ్వర్ ఫామ్ తగ్గడానికి కారణమిదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Manjrekar Interesting Comments On Bhuvaneshwar Kumar Form: టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ఎంత గొప్ప బౌలరో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తన స్వింగ్ మేజిక్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముచ్చెమటలు పట్టించే భువి.. ఎన్నోసార్లు మ్యాచ్‌లను మలుపు తిప్పాడు. భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అలాంటి భువి ఇప్పుడు ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. వికెట్లు తీయడం దేవుడెరుగు.. కనీసం కంట్రోల్ కూడా చేయలేకపోతున్నాడు. భారీ పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఆసియా కప్‌లో భువి ఎంత పేలవ ప్రదర్శన కనబరిచాడో అందరికీ తెలిసిందే! ఆఖరి ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్‌లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. దీంతో.. భువి ఫామ్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందిస్తూ.. భువనేశ్వర్ ఫామ్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది అతడు ఎక్కువగా ఆడుతున్నాడని, అలసట కారణంగానే ఫామ్ తగ్గిందని తన అభిప్రాయం వ్యక్తపరిచాడు. ‘‘భువి ఫామ్ తగ్గడానికి కారణం.. ఈ ఏడాది అతడు ఎక్కువ మ్యాచ్‌లు ఆడటమే. ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లోని ఒక్క మ్యాచ్ మినహా.. అతడు అన్ని మ్యాచ్‌లు ఆడాడు. భువిని నేను చాలా సంవత్సరాల నుంచి గమనిస్తూనే ఉన్నా. అతడు పని భారాన్ని ఎక్కువగా తీసుకోడు. ఒకట్రెండు ఫార్మాట్లే ఆడుతాడు. విరామం తీసుకొని, ఏదైనా టోర్నీలోకి కంబ్యాక్ ఇస్తే.. అప్పుడు తొలి మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తాడు. కానీ, ఈ ఏడాదిలో విరామం లేకుండా మ్యాచ్‌లు ఆడటం వల్ల.. అతని ఫామ్ తగ్గింది’’ అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడో సీమర్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని.. హర్షల్ పటేల్‌కి కొన్ని పరిమితులున్నాయి కాబట్టి, మహమ్మద్ షమీ పర్ఫెక్ట్ ఆప్షన్ అని తెలిపాడు.
Also Read
- BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
- Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
- India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
తాజావార్తలు
-
Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!