NTV Telugu Site icon

సిరాజ్‌ గురించి అసలు ప్రస్తావనే లేదు: మంజ్రేకర్

Siraj1

Siraj1

శ్రీలంకతో వన్డే సిరీస్‌తో పాటు తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌నూ టీమిండియా కైవసం చేసుకుంది. శుభ్‌మన్‌ గిల్‌, రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో అదరగొట్టగా.. కుల్దీప్ యాదవ్‌ బౌలింగ్‌లో రాణించాడు. అలాగే సిరాజ్‌ కూడా రెండు మ్యాచుల్లో కీలకమైన వికెట్లు తీశాడు. అయితే మూడో వన్డే తర్వాత సిరాజ్‌ గురించి పెద్దగా మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగించిందని మాజీ క్రికెటర్ సంజయ్‌ మంజ్రేకర్‌ తెలిపాడు. నిలకడగా ఆడుతూ అద్భుతమైన పెర్ఫామెన్స్ చేస్తున్న సిరాజ్‌పై మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు.

R Sridhar : అశ్విన్ అలా అనేసరికి షాకయ్యా: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్

“న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డే అనంతరం సిరాజ్‌ గురించి ప్రస్తావన చాలా తక్కువగా ఉంది. ఎవరూ కూడా పెద్దగా మాట్లాడలేదు. అయితే నేను చూసిన నంబర్‌వన్‌ ఆటగాడు సిరాజ్‌ మాత్రమే. అతడి ఎదుగుదల కూడా అద్భుతంగా ఉంది. ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పాను. మంచి లయతో బంతులను విసురుతున్నాడు. వన్డేల్లోనే కాకుండా.. టీ20లు, టెస్టుల్లోనూ రాణిస్తున్నాడు. ఇక బ్యాటింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ ద్విశతకం, శతకం సాధించాడు. కానీ, కఠినమైన ప్రత్యర్థితో ఆడేటప్పుడు.. భారీగా ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి సమయంలో బౌలింగ్‌ చేయడం కూడా కష్టమే. అయితే, భారత్‌కు సిరాజ్‌ దొరికాడు. టీమిండియాకు అవసరమైనప్పుడు సిరాజ్‌ వికెట్లను తీసి రాణించాడు” అని మంజ్రేకర్ తెలిపాడు.

MS Dhoni: ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఇక తగ్గేదే లే

ఇక న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేలో దుమ్ములేపింది టీమిండియా. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్, గిల్ అదిరిపోయే శుభారంభం అందించారు. రోహిత్ 85 బంతుల్లో 101 రన్స్‌ చేసి వన్డేల్లో 30వ సెంచరీ ఖాతాలో వేసుకోగా.. గిల్ 78 బంతుల్లో 112 రన్స్‌తో శతకం బాదాడు. దీంతో నిర్ణీత ఓవర్లలో టీమిండియా 385/9 భారీ స్కోర్ చేసింది. అనంతరం బౌలింగ్‌లోనూ భారత బౌలర్లు రాణించడంతో కివీస్‌ 41.2 ఓవర్లలో 295 రన్స్‌కు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో ఓపెనర్ కాన్వే (138) తప్ప మరెవరూ ఆకట్టుకోలేకపోయారు. భారత బౌలర్లలో శార్దూల్, కుల్దీప్ చెరో 3 వికెట్లతో సత్తాచాటగా.. చాహల్ 2, ఉమ్రాన్ 1, హార్దిక్ 1 వికెట్లు దక్కించుకున్నారు.