Site icon NTV Telugu

Sania Mirza : ఆశ నిరాశే.. సెమీస్‌లో వెనుదిరిగిన సానియా..

Sania Mirza

Sania Mirza

కెరీర్‌లో ఆఖరి వింబుల్డన్‌ ఆడుతున్న సానియా మీర్జాకు నిరాశే మిగిలింది. వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌లో భార‌త టెన్నిస్ దిగ్గ‌జం సానియా మీర్జా 21 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ఎండ్‌కార్డ్ పడింది. ప్ర‌తిష్ఠాత్మ‌క వింబుల్డ‌న్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ చాంపియ‌న్ షిప్‌లో మిక్స్ డ్ డబుల్స్ లో ఒక్క మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ కూడా గెలవకుండానే కెరీర్‌కు ముగింపు సానియా వెనుదిరిగింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో క్రొయేషియా ఆటగాడు మేట్‌ పావిచ్‌తో కలిసి బరిలోకి దిగిన సానియా బుధవారం అర్థరాత్రి జరిగిన ఈ సెమీఫైనల్‌లో ఆమెరికన్‌-బ్రిటిష జంట డెసిరే క్రాజిక్‌, నీల్‌ స్కుప్స్కీ చేతిలో 6-4, 5-7, 4-6తో ఓటమిపాలైంది.

 

ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను సులువుగా నెగ్గిన సానియా-ప‌విచ్ ద్వ‌యం రెండో సెట్ లో 2-0తో ఆధిక్యం సాధించి సులభంగా మ్యాచ్ గెలిచేలా క‌నిపించింది. వింబుల్డన్ మినహా సానియా ఖాతాలో మిగిలిన మూడు గ్రాండ్‌స్లామ్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్స్‌ (యూఎస్‌ ఓపెన్‌, ఆస్ట్రేలియా ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌) ఉన్నాయి. ఒక్క వింబుల్డ‌న్ మిక్స్ డ్ టైటిల్ మాత్ర‌మే ఆమెకు ఇప్ప‌టిదాకా అంద‌లేదు.

 

 

Exit mobile version