Sania Mirza Announced Her Retirement: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ట్విటర్ మాధ్యమంగా తన రిటైర్మెంట్‌ను ప్రకటించింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫిబ్రవరిలో జరిగే దుబాయ్ ఓపెన్ తర్వాత తాను టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్టు తెలిపింది. ఈ రెండు తనకు చివరి టోర్నీలను వెల్లడించింది. ఈ మేరకు ట్విటర్ మాధ్యమంగా.. మూడు పేజీల నోట్‌లో తన సుదీర్ఘ ప్రయాణం, పోరాటం గురించి వివరించింది.
Only Teacher: స్కూల్‌లో ఇక నో సార్.. నో మేడం.. ఓన్లీ టీచర్..
‘‘30 ఏళ్ల క్రితం ఓ ఆరేళ్ల చిన్నారిని పట్టుకొని వాళ్ల నిజాం క్లబ్‌లో అడుగుపెట్టింది. తమ కూతురికి టెన్నిస్ నేర్పించమని కోచ్‌ని కోరితే.. ఇంత చిన్న వయసులో అవసరమా? అని కోచ్ అనుకున్నాడు. అయితే.. ఆ పాప మాత్రం ఆరేళ్ల వయసులోనే తన కలల కోసం పోరాడడం మొదలెట్టింది’’ అంటూ తన టెన్నిస్ జర్నీ గురించి సానియా చెప్పుకొచ్చింది. ఎన్నో కష్టాలు, సమస్యలు, ఇబ్బందులను అధిగమించి.. తాను కెరీర్‌లో మొదటి గ్రామ్ స్లామ్ ఆడానని, దేశానికి ప్రాతినిథ్యం వహించే అతి గొప్ప గౌరవం తనకు పొందిందని తెలిపింది. తన కెరీర్‌లో తాను 50 గ్రాండ్ స్లామ్స్‌పైగా ఆడానని, వాటిల్లో కొన్ని టైటిల్స్ కూడా గెలిచానని గుర్తు చేసుకుంది. పొడియంలో త్రివర్ణ పతాకంతో నిలబడడమే తనకు దక్కిన అత్యున్నత గౌరవమని పేర్కొంది.
Varanasi Tent City: వారణాసిలో టెంట్ సిటీ.. ప్రారంభించిన ప్రధాని మోడీ
తన రిటైర్మెంట్ లేఖ రాస్తున్నప్పుడు తన కళ్లల్లో నీళ్లు తిరిగాయని, గర్వంతో తన మనసు ఉప్పొంగిందని సానియా పేర్కొంది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి.. టెన్నిస్ ప్రపంచంలో ఎన్నో అఖండ విజయాలు అందుకోగలిగిందంటే, అంత తేలికైన విషయం కాదంది. అన్ని సమయాల్లో తల్లిదండ్రులు, కుటుంబం, కోచ్, ఫిజియో, మొత్తం టీం మద్దతు లేకపోయి ఉంటే.. ఇది సాధ్యమయ్యేది కాదని చెప్పింది. 2005లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో తన గ్రాండ్ స్లామ్ జర్నీని ప్రారంభించానని, అక్కడే ముగించడం సమంజసమని తాను భావిస్తున్నానని సానియా రాసుకొచ్చింది. కాగా.. తన కెరీర్‌లో ఎన్నో టైటిల్స్‌తో పాటు మరెన్నో ఘనతల్ని సొంతం చేసుకున్న సానియా.. డబుల్స్‌లో 2015లో వరల్డ్ నెం.1 ర్యాంకును పొందింది.
Woman Harassment Case: భారత మహిళపై లైంగిక వేధింపులు.. పాకిస్తాన్ రియాక్షన్ ఏంటంటే?
Life update 🙂 pic.twitter.com/bZhM89GXga
— Sania Mirza (@MirzaSania) January 13, 2023