Site icon NTV Telugu

RR Captain 2026: రాజస్థాన్ రాయల్స్‌కు కొత్త యాజమాన్యం.. కెప్టెన్‌గా యశస్వి జైస్వాల్‌, నిజమేనా?

Rr Captain 2026

Rr Captain 2026

Riyan Parag Confirmed RR Captain in IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టులో యాజమాన్య మార్పు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త కల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం ఈ ఫ్రాంచైజీని సుమారు 1.63 బిలియన్ డాలర్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఈ భారీ డీల్‌తో రాజస్థాన్ ప్రాంచైజీ మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే యాజమాన్యం మారిన వెంటనే జట్టులో కీలక మార్పులు ఉంటాయన్న ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ విషయంలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ప్రస్తుత కెప్టెన్ రియాన్ పరాగ్ స్థానంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను కెప్టెన్‌గా నియమించాలని కొత్త యాజమాన్యం బావిస్తోందన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ రూమర్స్ క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. అయితే ఈ వార్తలన్నీ పూర్తిగా నిరాధారమని తాజాగా స్పష్టమైంది. యాజమాన్యం లేదా కల్ సోమాని ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ఇప్పటికే ఐపీఎల్ 2026 సీజన్ కోసం రియాన్ పరాగ్‌ను అధికారిక కెప్టెన్‌గా రాజస్థాన్ రాయల్స్ ప్రకటించింది. జట్టు యాజమాన్యం కూడా తన నిర్ణయంపై నిలబడుతూ.. పరాగ్ నాయకత్వంపై పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తోంది. కొత్త యాజమాన్యం వచ్చినప్పటికీ జట్టు, కెప్టెన్సీ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టమవుతోంది. రియాన్ పరాగ్ నేతృత్వంలోనే రాజస్థాన్ ఈ సీజన్‌లో బరిలోకి దిగనుంది. అభిమానులు కూడా ఐపీఎల్ 2026 ప్రారంభం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version