NTV Telugu Site icon

RCB vs CSK: టాస్ గెలిచిన ఆర్సీబీ.. బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే

Rcb Vs Csk

Rcb Vs Csk

Royal Challengers Bangalore Won The Toss And Chose To Field: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వేదికగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇది 24వ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో.. బ్యాటింగ్ చేసేందుకు చెన్నై రంగంలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఎటువంటి మార్పులు చేయకపోగా.. చెన్నై జట్టు మాత్రం గాయపడిన మగాల స్థానంలో శ్రీలంక యువ పేసర్ మతీషాను తీసుకుంది. ఈ రెండు జట్లకి క్రీడాభిమానుల్లో ఉన్న ఆదరణ కారణంగా.. ఈ మ్యాచ్‌పై జనాల్లో ఎనలేని ఆసక్తి నెలకొంది. రెండు జట్లకు సపోర్ట్ చేస్తూ.. ఎవరు గెలుస్తారా? అని ఆతృతగా వేచి చూస్తున్నారు.

Virat Kohli: గంగూలీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్.. ఏం చేశాడో తెలుసా?

గత మ్యాచ్‌లో సీఎస్కే ఓటమి చవిచూడటంతో.. ఈ మ్యాచ్‌లో గెలవాలని కసిగా ఉంది. ఎప్పట్లాగే ఈ మ్యాచ్‌లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. గతంలో చిన్నస్వామి స్టేడియంలో రప్ఫాడించిన సందర్భాలూ ఉన్నాయి కాబట్టి, అదే జోరుతో దూసుకెళ్లాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు.. ఢిల్లీపై గత మ్యాచ్‌లో ఆర్సీబీ గెలుపొందడం, సొంతగడ్డపై మ్యాచ్ కావడంతో.. మరో విజయాన్ని నమోదు చేయాలని ఆర్సీబీ భావిస్తోంది. ‘ఈ సాలా కప్ నమ్దే’ అనే నినాదాన్ని సీరియస్‌గా తీసుకొని.. కప్ కొట్టాలన్న లక్ష్యంతోనే ఆర్సీబీ దూసుకెళ్తోంది. మరి.. సీఎస్కేని ఓడించి ఆర్సీబీ తన సక్సెస్ స్ట్రీక్‌ని కొనసాగిస్తుందా? లేక చెన్నై ఆధిపత్యం చెలాయిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!

Yo Yo Honey Singh: హీరోయిన్‌తో డేటింగ్.. రెడ్‌హ్యాండెడ్‌గా బుక్.. వీడియో వైరల్

తుది జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్‌), మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్‌), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, వైషాక్ విజయ్ కుమార్, మహ్మద్ సిరాజ్

Show comments