Site icon NTV Telugu

IPL 2023: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ

Rcb

Rcb

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా మ్యాచ్ నెంబర్ 65లో ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడుతుంది. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ఆర్సీబీకి చాలా కీలకం కానుంది. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్ లో తప్పని సరిగా విజయం సాధించాల్సిందే.

Also Read : Revanth Reddy : నేను ఓ మెట్టు దిగి వస్తా ఆలోచించండి.. కలిసి పనిచేద్దాం..

తమ దగ్గర అద్భుతమైన బౌలింగ్ ఉందని ఆర్సీబీ సారథి ఫాఫ్ డు ప్లెసిస్ అన్నారు. ఈ పిచ్ పై గత రెండు రాత్రులు కొంత మంచు కురిసింది. మంచి ఉపరితలం ఉంటుంది. అయితే ఈ పిచ్ నెమ్మదిగా కొనసాగుతుందని ఫాప్ అన్నారు. ప్రస్తుతం జట్టులోకి హసరంగతో పాటు బ్రేస్ వెల్ ఉన్నారు. బౌలింగ్, బ్యాటింగ్ లో ఇద్దరు గట్టిగా ఉందని ఆర్సీబీ సారథి ఫాఫ్ డు ప్లెసిస్ తెలిపాడు.

Also Read : High Blood Pressure : అధిక రక్తపోటు ఉన్నవారు ఈ వ్యాయామం చేయకూడదు

ఒక వేళ మేము టాస్ గెలిచి ఉంటే తొలుత బ్యాటింగ్ తీసుకునే వాళ్లమని సన్ రైజర్స్ కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ అన్నాడు. ప్లే ఆఫ్స్ కు తాము వెళ్లలేక పోయినందుకు పెద్దగా నిరాశ చెందలేదు అని మార్ర్కమ్ అన్నారు. అయితే ఈ మ్యాచ్ లో హ్యారీ బ్రూక్ తిరిగి జట్టులోకి వస్తాడు అని పేర్కొన్నాడు. కార్తీక్ త్యాగి కూడా అందుబాటులోకి వస్తాడని తెలిపాడు. ఉమ్రాన్ఎక్స్-ఫాక్టర్ ప్లేయర్. తాము అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనఫ్ కలిగి ఉన్నట్లు సన్ రైజర్స్ కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ తెలిపాడు.

Also Read : The Kerala Story: “ది కేరళ స్టోరీ”కి ఊరట.. పశ్చిమ బెంగాల్ నిషేధంపై స్టే విధించిన సుప్రీంకోర్టు..

తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్ (సి), హెన్రిచ్ క్లాసెన్ (w), హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, కార్తీక్ త్యాగి, మయాంక్ డాగర్, భువనేశ్వర్ కుమార్, నితీష్ రెడ్డి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (సి), గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్ (w), షాబాజ్ అహ్మద్, మైకేల్ బ్రేస్‌వెల్, వేన్ పార్నెల్, హర్షల్ పటేల్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్.

Exit mobile version