NTV Telugu Site icon

RCB vs KKR: ముగిసిన కేకేఆర్ బ్యాటింగ్.. ఆర్సీబీ ముందు భారీ లక్ష్యం

Kkr 20 Overs Innings

Kkr 20 Overs Innings

Royal Challengers Bangalore Needs To Score 201 Runs To Win The Match: బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైడ్ రైడర్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. జేసన్ రాయ్ (56) అర్థశతకంతో రాణించడం.. కెప్టెన్ నితీశ్ రానా (48) మెరుపు ఇన్నింగ్స్ ఆడటం.. చివర్లో రింకూ సింగ్ (18), డేవిడ్ వీస్ (12) విజృంభించడంతో.. కేకేఆర్ ఇంత భారీ స్కోరు చేయగలిగింది. ఈ మ్యాచ్ గెలవాలంటే.. ఆర్సీబీకి 201 పరుగులు చేయాల్సి ఉంటుంది. చిన్నస్వామి లాంటి స్టేడియంలో ఇంత భారీ లక్ష్యాన్ని ఛేధించడం అంత కష్టమేమీ కాదు. మరి, ఆర్సీబీ ఈ లక్ష్యాన్ని ఛేధిస్తుందా? లేదా? వేచి చూడాలి.

KA Paul: పవన్ కల్యాణ్ డ్యాన్స్ వేస్తే రాష్ట్రంలో అప్పులు తీరుతాయా..

తొలుత టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో.. కేకేఆర్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. తొలుత కాస్త నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్లు.. ఆ తర్వాత విజృంభించారు. ఓవైపు జగదీశన్ మద్దతు ఇస్తుండగా.. మరోవైపు జేసన్ రాయ్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. ఎడాపెడా షాట్లతో మైదానంలో పరుగుల వర్షం కురిపించాడు. కేవలం 22 బంతుల్లోనే అతడు అర్థశతకం కంప్లీట్ చేసుకున్నాడంటే, ఎలా విధ్వంసం సృష్టించాడో అర్థం చేసుకోవచ్చు. జగదీశన్ మాత్రం పెద్దగా సత్తా చాటలేదు. అతడు 29 బంతుల్లో 27 పరుగులే చేశాడు. అనంతరం వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రానా కలిసి.. కాసేపు మైదానంలో మెరుపులు మెరిపించారు. ముఖ్యంగా.. రానాకు రెండు లైఫ్‌లు దక్కడంతో, అతడు దుమ్ముదులిపేశాడు. కానీ.. మూడోసారి క్యాచ్ ఔట్ అయ్యాడు. రెండు పరుగుల తేడాతో అతడు అర్థశతకం మిస్ చేసుకున్నాడు.

Tallest Towers: ప్రపంచంలో అత్యంత ఎత్తైన టాప్-10 టవర్లు

ఎప్పట్లాగే ఈసారి కూడా ఆండ్రూ రసెల్ తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం ఒకే ఒక్క పరుగు చేసి, సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో వచ్చిన రింకూ సింగ్.. అందరి అంచనాలకు తగ్గట్టుగానే చెలరేగి ఆడాడు. 10 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ సహకారంతో 18 పరుగులు చేశాడు. తానూ ఏం తిక్కు తినలేదన్నట్టు.. డేవిడ్ వీస్ కూడా రెండు భారీ సిక్స్‌లు కొట్టాడు. అతడు 3 బంతుల్లోనే 12 పరుగులు చేశాడు. చివరి బంతికి అతడు సిక్స్ కొట్టడంతో.. కేకేఆర్ 200 పరుగుల మైలురాయిని అందుకోగలిగింది. కేకేఆర్ బౌలర్ల విషయానికొస్తే.. హసరంగ, వైశాక్ విజయ్ కుమార్ తలా రెండు వికెట్లు తీయగా.. సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.