NTV Telugu Site icon

RCB VS KKR: స్వదేశంలో.. ఆర్సీబీ ఆ రికార్డు బ్రేక్ చేస్తుందా..!

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి . సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో స్వదేశంలో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్, మొదటి గేమ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో ఓడిపోయినా ఆర్సీబీ తన రెండో గేమ్ లో పంజాబ్ కింగ్స్‌ పై ఈ సీజన్‌ లో మొదటి విజయాన్ని నమోదు చేయడంతో.. ఇప్పుడు పాయింట్ల పట్టికలో పైకి రావడానికి వరుసగా రెండవ విజయంపై దృష్టి పెట్టింది.

Also Read; MS Dhoni: సీఎస్కే కొత్త కెప్టెన్పై ఎంఎస్ ధోని స్టన్నింగ్ కామెంట్స్..

ఇప్పటివరకు ఆర్సీబీ మరియు కేకర్ రికార్డ్స్ చూసినట్టు అయితే కోల్‌కతా, బెంగళూరు జట్లు మొత్తంగా 32 మ్యాచ్‌ ల్లో తలపడ్డాయి, వీటిలో  కోల్‌కతా నైట్ రైడర్స్ 18 మ్యాచ్ లలో విజయం సాధించిగా .. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 మ్యాచ్ లలో విజయం సాధించింది. ఇక బెంగళూరు వేదికగా కూడా ఆతిధ్య రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 – 4 తో వెనక పడి ఉంది. బెంగళూరులోని M.చిన్నస్వామిలో కోల్‌కతా పైన ఆర్సీబీ కి చెప్పుకో దగిన రికార్డ్స్ లేవు. స్వదేశంలో కేకర్ తో జరిగే మ్యాచ్స్ లో గత ఐదు సంవత్సరాల నుండి ఆర్సీబీ కోల్‌కతా పైన ఓడిపోతూనే వస్తుంది. నేడు అయినా ఈ ఆనవాయితీ మారుస్తుందో లేక మల్లి డీలా పడుతుందో చూడాలి..

జట్టులు అంచనా :-

రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు:
ఫాఫ్ డు ప్లెసిస్ (సి), విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్ (డబ్ల్యూకే), మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, మయాంక్ డాగర్, అల్జారీ జోసెఫ్

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR):
ఫిల్ సాల్ట్ (WK), సునీల్ నరైన్, నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ