FIFA World Cup 2026 Final: స్పెయిన్ VS అర్జెంటీనా.. గెలిచేది ఎవరో చెప్పిన రొనాల్డో

  • ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో స్పెయిన్‌దే విజయం..
  • అంచనా వేసిన బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డో నజారియో
Fifa World Cup 2026 Final

Fifa World Cup 2026 Final

FIFA World Cup 2026 Final: ప్రపంచం మొత్తం ఫుట్‌బాల్ ఫీవర్‌తో ఊగిపోతోంది. ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, స్పెయిన్ తలపడబోతున్నాయి. ఇదిలా ఉంటే, ఈ హై ఓల్టేజ్ ఫైనల్‌లో ఎవరు గెలుస్తారనే దానిపై పలువురు అంచనా వేస్తున్నారు. అయితే, బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డో నజారియో మాత్రం ఈ సారి స్పెయిన్‌దే కప్పు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టోర్నమెంట్‌లో ఇప్పటి వరకు స్పెయిన్ దాదాపు అన్ని మ్యాచులపై పూర్తి ఆధిపత్యం చెలాయించిందని, అదే విధంగా ఫైనల్‌లో కూడా ఆడుతుందని అభిప్రాయపడ్డారు. ఈఎస్పీఎన్ బ్రెజిల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

అర్జెంటీ వరసగా రెండోసారి ప్రపంచకప్ గెలిచి 1962లో బ్రెజిల్ సాధించిన రికార్డును సమం చేయాలని భావిస్తోంది. మరోవైపు, స్పెయిన్ గత 7 మ్యాచుల్లో కేవలం ఒకే ఒక్క గోల్ మాత్రమే ఇచ్చింది. టోర్నమెంట్‌కు ముందు ఫ్రాన్స్, స్పెయిన్ తన ఫేవరెట్ జట్లుగా రొనాల్డో చెప్పారు. సెమీఫైనల్‌లో స్పెయిన్ 2-0తో ఫ్రాన్స్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. మరో సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1తో ఇంగ్లండ్‌పై విజయం సాధించి ఫైనల్ బెర్త్ దక్కించుకుంది.

స్పెయిన్ ఒకటి లేదా రెండు గోల్స్‌లో ఆధిక్యంలోకి వెళ్తే అర్జెంటీనా తిరిగి మ్యాచ్‌లోకి రావడం చాలా కష్టమని, బంతిపై స్పెయిన్‌దే పూర్తి ఆధిపత్యం ఉంటుందని రొనాల్డో వ్యాక్యానించచారు. ఇదిలా ఉంటే, మూడో స్థానం కోసం జరిగే మ్యాచ్‌లో ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబాపే రెండు గోల్స్ చేసి వరల్డ్ కప్‌ చరిత్రలో లియోనల్ మెస్సీ నెలకొల్పిన 21 గోల్స్ రికార్డును అధిగమించారు. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 6-4తో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది.