Rohit Sharma Record: 12 ఏళ్లయినా చెక్కుచెదరని హిట్‌మ్యాన్ రికార్డు.. చేరువలోనూ ఎవరూ లేరు!

Rohit Sharma Unbroken Odi Record

Rohit Sharma Unbroken Odi Record

Rohit Sharma Unbroken ODI Record: టీమిండియా సీనియర్ ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో అరుదైన రికార్డులు సృష్టించాడు. ముఖ్యంగా వన్డే క్రికెట్‌లో అతడి పేరిట ఉన్న ఓ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. పన్నెండేళ్లు గడిచినా ఆ రికార్డుకు సమీపంలోకి కూడా మరో బ్యాటర్ రాలేకపోయాడు. ఆ రికార్డు మరేదో కాదు.. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. 2014లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ కేవలం 173 బంతుల్లోనే 264 పరుగులు బాది ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచాడు.

ప్రపంచ క్రికెట్‌లో మూడు వన్డే డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్‌గా కూడా రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. హిట్‌మ్యాన్ తొలిసారి 2013లో ద్విశతకం నమోదు చేశాడు. బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 158 బంతుల్లో 209 పరుగులు చేసి వన్డేల్లో తన మొదటి డబుల్ సెంచరీని సాధించాడు. ఆ తర్వాత 2014లో కోల్‌కతాలో శ్రీలంకపై చరిత్ర సృష్టించాడు. 173 బంతుల్లో 264 పరుగులు చేసి వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో 33 ఫోర్లు, 9 సిక్సర్లు ఉండడం విశేషం. ఇక 2017లో మొహాలీ వేదికగా శ్రీలంకపైనే మరోసారి ద్విశతకం బాదాడు. 153 బంతుల్లో అజేయంగా 208 పరుగులు చేసి తన ఖాతాలో మూడో డబుల్ సెంచరీని జమ చేసుకున్నాడు.

ప్రస్తుతం భారత క్రికెట్‌లో రెండు వన్డే ద్విశతకాలు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ తర్వాతి స్థానంలో శుభ్‌మన్ గిల్ ఉన్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఒక్కో వన్డే డబుల్ సెంచరీ చేశారు. అయినప్పటికీ మూడు ద్విశతకాలతో రోహిత్ అందరికంటే ప్రత్యేకంగా నిలిచాడు. రోహిత్ రికార్డును గిల్ దాటే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు శతకాలు బాదిన గిల్.. మూడోది కూడా బడుతాడేమో చూడాలి. ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య బే ఓవల్ వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో రోహిత్ విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ డకౌట్ అయ్యాడు.