Site icon NTV Telugu

Rohit Sharma: రోహిత్ శర్మపై నెటిజన్‌ల ఫైర్.. జాతీయ జెండాను అవమానించాడంటూ చీవాట్లు

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma: ఇండిపెండెన్స్ డే సందర్భంగా టీమిండియా క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా ద్వారా భారతీయులకు విషెస్ తెలియజేశారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ జాతీయ జెండాను పట్టుకుని ఉన్న ఓ ఫోటోను షేర్ చేసి విషెస్ తెలిపాడు. అయితే రోహిత్ శర్మ పోస్ట్ చేసిన ఫోటో వివాదానికి దారి తీసింది. సదరు పోస్టులో రోహిత్ షేర్ చేసిన ఫోటో మార్ఫింగ్ అంటూ పలువురు నెటిజన్‌లు ఆరోపిస్తున్నారు. జాతీయ జెండాను రోహిత్ మార్ఫింగ్ చేశాడంటూ మండిపడుతున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు రోహిత్ జాతీయ జెండాను అవమానించాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Asia Cup 2022: ఆరు నిమిషాల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్లన్నీ హాంఫట్..!!

రోహిత్ పట్టుకున్న జెండా కర్రలో ఒక దగ్గర రెండుగా చీలినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే.. హిట్ మ్యాన్ పట్టుకున్న కర్రకు జాతీయ జెండా ఉన్న రాడ్‌ను అతికించారని నెటిజనులు ఆరోపిస్తున్నారు. ఆరోపణలే కాదు.. పలువురు నెటిజన్లు ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా పోస్ట్ చేస్తున్నారు. రోహిత్ దగ్గర కోట్లకు కోట్ల డబ్బులున్నాయని.. ఇలా ఎడిట్ చేసుకోవడమెందుకు..? ఓ జాతీయ జెండా, జెండా కర్రను కొనుక్కోలేడా అంటూ పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జాతీయ జెండా కొనుక్కునే డబ్బులు లేకపోతే తాము పైసలు ఇచ్చే వాళ్ళం కదా అంటూ మరికొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక జాతీయ జట్టుకు కెప్టెన్ గా ఉండి ఇలా వ్యవహరించడం దుర్మార్గమని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version