ఐపీఎల్ టైటిల్ ను అత్యాధికార్లు గెలిచినా జట్టు ముంబై ఇండియన్స్. ఇప్పటివరకు ఈ జట్టు 5 సార్లు టైటిల్ సాధించడానికి ఆ జట్టు ఆటగాళ్లే కారణం. అయితే నిన్న ఐపీఎల్ 2022 యొక్క రిటైన్ లో ముంబై జట్టులోని నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉండటంతో.. రోహిత్ శర్మ. బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్ ను తమతో ఉంచుకుంది జట్టు యాజమాన్యం. అయితే ఈ రిటెన్షన్ పై ఆ జట్టు కెప్టెన్ రోహిత్ స్పందించాడు. మా జట్టులో చాలా మంది అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. ఇలా వారిని ఇప్పుడు వదిలిపెట్టడం చాలా బాధాకరంగా ఉంది. మా జట్టు కోసం ఆ ఆటగాళ్లు చాలా అద్భుతమైన పనులు చేసారు. అలాగే ఎన్నో జ్ఞాపకాలను ఏర్పరిచారు. అలాంటి వారిని విడిచిపెట్టడం చాలా కష్టం. ఇక మాకు మరో మంచి జట్టు ఏర్పరిచే లక్ష్యం మెగా వేలంలో ప్రారంభమవుతుంది అవుతుంది అని రోహిత్ చెప్పాడు. మంచి ఆటగాళ్లను జట్టులోకి తీసుకొని.. మేము బలంగా మారుతాము అని ఆశిస్తున్నాము అంటూ రోహిత్ పేర్కొన్నారు.
ముంబై ఇండియన్స్ కు రిటెన్షన్ చాలా కష్టమైన పని : రోహిత్ శర్మ
