Rohit Sharma Golden Duck: న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ నిరాశపరిచాడు. భారత ఇన్నింగ్స్ తొలి బంతికే హిట్‌మ్యాన్ పెవిలియన్ చేరాడు. న్యూజిలాండ్ పేసర్ మాట్ హెన్రీ వేసిన మొదటి బంతిని ఎదుర్కొన్న రోహిత్.. ఫిన్ అలెన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఒక్క పరుగు కూడా చేయకుండానే గోల్డెన్ డక్‌గా రోహిత్ వెనుదిరిగాడు. ఈ ఔట్‌తో రోహిత్ ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.
వన్డే ఇన్నింగ్స్ తొలి బంతికే ఔటైన భారత బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ కూడా చేరాడు. ఈ జాబితాలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అగ్ర స్థానంలో ఉన్నారు. ఈ ఇద్దరు మాజీలు మూడేసి సార్లు తొలి బంతికే వికెట్ కోల్పోయారు. దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ సహా రవిశాస్త్రి, కృష్ణమాచారి శ్రీకాంత్, మనోజ్ ప్రభాకర్ ఒక్కోసారి ఇన్నింగ్స్ మొదటి బంతికే ఔట్ అయ్యారు. తాజాగా ఈ జాబితాలో రోహిత్ కూడా చేరాడు. హిట్‌మ్యాన్ వంటి స్టార్ బ్యాటర్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్ కోల్పోవడం భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
వన్డే ఇన్నింగ్స్‌లో తొలి బంతికే అవుటైన భారత బ్యాటర్ల లిస్ట్:
సౌరవ్ గంగూలీ (మూడుసార్లు)
వీరేంద్ర సెహ్వాగ్ (మూడుసార్లు)
సునీల్ గవాస్కర్ (ఒక్కోసారి)
రవిశాస్త్రి (ఒక్కోసారి)
క్రిస్ శ్రీకాంత్ (ఒక్కోసారి)
మనోజ్ ప్రభాకర్ (ఒక్కోసారి)
రోహిత్ శర్మ (ఒక్కోసారి)

