బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులో టీమిండియా తొలుత తడబడినా తరువాత కుదురుకుంది. టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసి భారత్‌కు మంచి స్కోరును అందించాడు. ఈ మ్యచ్‌లో రిషబ్ పంత్ 111 బంతుల్లోనే 146 పరుగులు చేశాడు. అయితే 89 బంతుల్లోనే సెంచరీ చేసి భారత్ తరఫున టెస్టుల్లో వేగంగా సెంచరీ చేసిన వికెట్ కీపర్‌గా నిలిచాడు. దీంతో 17 ఏళ్ల క్రితం నాటి ధోనీ రికార్డును అధిగమించాడు. 2005లో పాకిస్థాన్‌పై ధోనీ 93 బంతుల్లో సెంచరీ సాధించాడు. అంతే కాకుండా ఈ టెస్టు ద్వారా మరో అరుదైన రికార్డును పంత్ బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సిక్సులు కొట్టిన అతిపిన్న వయస్కుడిగా పంత్ నిలిచాడు. గతంలో టీమిండియా తరఫున 25 ఏళ్ల వయసులో సచిన్ 100 సిక్సర్ల మైలురాయిని చేరుకున్నాడు. ప్రస్తుతం పంత్ 24 ఏళ్ల 271 రోజుల్లోనే ఈ ఫీట్ సాధించి సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు.
Read Also: హాలీవుడ్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’కి సెకండ్ ప్లేస్
మరోవైపు ఇంగ్లండ్ గడ్డపై రెండు సెంచరీలు సాధించిన ఏకైక భారత్ వికెట్ కీపర్‌గా పంత్ చరిత్ర సృష్టించాడు. మొత్తంగా ఆసియా ఖండం వెలుపల అతడికి ఇది నాలుగో సెంచరీ. టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన పంత్ దూకుడుగా ఆడి సెంచరీ చేయడంపై క్రికెట్ వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. గతంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో పేలవ ఫామ్ కారణంగా విమర్శలను ఎదుర్కొన్న పంత్ తన సూపర్ ఇన్నింగ్స్‌తో ఇప్పుడు విమర్శకులకు సమాధానం ఇచ్చాడు.