Site icon NTV Telugu

IPL 2022: రికార్డు బద్దలు కొట్టిన లక్నో-బెంగళూరు మ్యాచ్

Record Viewership

Record Viewership

ఐపీఎల్ 15వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌లో రెండు మ్యాచ్‌లు ముగిశాయి. గుజరాత్ టైటాన్స్ నేరుగా ఫైనల్‌కు చేరగా.. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడనున్నాయి. అయితే బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌ వ్యూస్ పరంగా ఓ అరుదైన రికార్డు సృష్టించింది. ఈ సీజన్‌లోనే ఎక్కువ మంది హాట్‌స్టార్‌ ఓటీటీలో వీక్షించిన మ్యాచ్‌గా రికార్డులకెక్కింది. ఈ మ్యాచ్‌ను మొత్తం 8.7 మిలియన్ల క్రికెట్ అభిమానులు హాట్ స్టార్ వేదికగా వీక్షించారు.

Shikar Dhawan: ధావన్‌ను చితకబాదిన తండ్రి.. కారణం ఏంటంటే..?

ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ పేరిట ఉంది. ఈ మ్యాచ్‌ను అత్యధికంగా 8.3 మిలియన్ల మంది వీక్షించారు. తాజా ఈ రికార్డును బెంగళూరు- లక్నో మ్యాచ్ బద్దలు కొట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక అభిమానులు ఉన్నారు. ఆ జట్టులో ప్రపంచ స్థాయి ఆటగాడు కోహ్లీతో పాటు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్, ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్సీబీ మ్యాచ్‌లను ఎక్కువ మంది వీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు టైటిల్ గెలవని ఆర్సీబీ.. ఈ సీజన్‌లో ఎలాగైనా కప్పు సొంతం చేసుకోవాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు.

Exit mobile version