NTV Telugu Site icon

RCB Twitter Hacked: ఆర్సీబీ ట్విట్టర్ హ్యాక్..పేరే మార్చేశారు!

Rcb Hacked 1674287732984 1674287768588 1674287768588

Rcb Hacked 1674287732984 1674287768588 1674287768588

ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన హ్యాకర్లు ఏకంగా ఆ ఖాతా పేరునే మార్చేశారు. అంతేకాకుండా ఆ ప్రొఫైల్ నుంచి NFT సంబంధిత ట్వీట్లను కూడా పోస్ట్ చేశారు. ఐపీఎల్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ఆర్సీబీ ఒకటి. అత్యధిక సోషల్ మీడియా ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న బెంగళూరు టీమ్ సోషల్ మీడియా ఖాతా ఇంతకుముందు కూడా హ్యాక్‌కు గురైంది. తాజాగా ఈ జట్టు ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసి దానికి Bored Ape Yacht Club అని పేరు మార్చారు. అలాగే, ఆర్సీబీ లోగో, ప్రొఫైల్ పిక్చర్‌ను కూడా చేంజ్ చేశారు. ఆ ఖాతాలో NFT సంబంధిత ట్వీట్లను కూడా పోస్ట్ చేశారు. తమ అధికారిక వెబ్‌సైట్ గురించి కూడా సమాచారం ఇచ్చారు.

Rohit Sharma: నవ్వులు పూయించిన రోహిత్ శర్మ..వైరల్ వీడియో

ఆర్సీబీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ కావడం ఇదే మొదటిసారి కాదు. 2021లో కూడా ఈ టీమ్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ జట్టు ట్విట్టర్ ఖాతాలను రెండుసార్లు హ్యాక్ చేసిన హ్యాకర్లు.. ఆగస్టు 2022లో ఈ టీమ్ యూట్యూబ్ చానెల్‌ను కూడా హ్యాక్ చేశారు. “మా ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. కొన్ని గంటల క్రితం తిరిగి వచ్చింది. మేము ఇప్పుడు యాక్సెస్‌ను తిరిగి పొందగలిగాం. హ్యాకర్లు పెట్టిన ట్వీట్‌ను మేం ఖండిస్తున్నాం. తొలగించిన ఆ ట్వీట్ నుండి ఎలాంటి కంటెంట్‌ను ఆమోదించం. జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము” అని ఆర్సీబీ అప్పట్లో ట్వీట్ చేసింది.

ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా టాప్‌లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ మాత్రం నెగ్గలేకపోయింది. ప్రతి సీజన్‌లో ప్రత్యర్థుల్ని భయపెట్టేలా కనిపించే ఈ టీమ్ అంచనాల్ని మాత్రం అందుకోలేకపోయింది. ఈ ఏడాది మినీ వేలంలో రీస్ టోప్లే, విల్ జాక్స్ లాంటి ప్లేయర్లను తీసుకుంది. మరి ఈసారైనా టైటిల్ నెగ్గి ఫ్యాన్స్‌కు ఖుషీ చేస్తుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.