RCB Name Change: ఆర్‌సీబీ పేరు మార్చే ఆలోచనలో కొత్త యాజమాన్యం.. నయా నేమ్ ఏంటో తెలుసా?

  • చేతులు మారిన ఆర్‌సీబీ ప్రాంచైజీ
  • రూ.16,706 కోట్లకు కొనుగోలు చేసిన కన్సార్టియం
  • ఆర్‌సీబీ పేరు మార్చే ఆలోచనలో కొత్త యాజమాన్యం
Rcb Name Change Rkb

Rcb Name Change Rkb

RCB May Be Renamed RKB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ప్రాంచైజీ చేతులు మారిన విషయం తెలిసిందే. ఆర్‌సీబీ ఫ్రాంచైజీని ఓ శక్తివంతమైన కన్సార్టియం సొంతం చేసుకుంది. ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, బోల్ట్‌ వెంచర్స్, బీఎక్స్‌పీఈ-బ్లాక్‌స్టోన్‌ సంస్థలు రూ.16,706 కోట్ల ధరకు కొనుగోలు చేశాయి. ఇప్పటివరకు డియాజియో ఆధీనంలో ఉన్న ఆర్‌సీబీ.. ఐపీఎల్ 2026 అనంతరం కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లనుంది. అయితే ఆర్‌సీబీ పేరు మార్చే ఆలోచనలో కొత్త యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆర్‌సీబీ కొత్త యాజమాన్యం బిర్లా గ్రూప్ జట్టు పేరును మార్చాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) పేరు తమ బ్రాండ్‌కు సరిపోదని భావిస్తున్న యాజమాన్యం.. జట్టుకు కొత్త పేరు పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రాయల్ కన్నడిగన్స్ బెంగళూరు (ఆర్‌కేబీ) పేరును పరిశీలిస్తున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఇదే నిజమైతే.. ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ఐడెంటిటీ మార్పుల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ఎన్నో ఏళ్లుగా ఆర్‌సీబీ పేరుతో అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించిన ఈ ఫ్రాంచైజీకి పేరు మార్పు పెద్ద షాక్‌గా మారవచ్చు.

Also Read: IPL 2026 SRH Full Schedule: ఐపీఎల్‌ మలిదశ షెడ్యూల్‌ విడుదల.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫుల్ షెడ్యూల్ ఇదే!

రాయల్ కన్నడిగన్స్ బెంగళూరు పేరుతో స్థానిక గుర్తింపును పెంచాలని కొత్త యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన అభిమానులను మరింత దగ్గర చేసుకునే ప్రయత్నం అని కొందరు అంటున్నారు. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కేవలం సోషల్ మీడియాలో వార్తలు మాత్రమే వినిపిస్తున్నాయి. జట్టు పేరు మారుతుందా? లేదా? అన్నదానిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే. ఏదేమైనా.. ఆర్‌సీబీ పేరు మార్పు వార్తలు ఐపీఎల్ అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.