Site icon NTV Telugu

RCB: ఇదీ ఆర్సీబీ సత్తా అంటే.. ప్రపంచంలోనే రెండో జట్టుగా రికార్డు

Royal Challengers Bangalore

Royal Challengers Bangalore

ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు ఉన్నారు. వరల్డ్‌లోనే బెస్ట్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, డివిలియర్స్, మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉండటంతో ఆ జట్టుకు క్రేజ్ విపరీతంగా ఉంటోంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా ఆ జట్టుకు క్రేజ్ అయితే తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో అభిమానులు చర్చించుకుంటున్న టాప్-3 క్రీడా జట్టుల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌కు చోటు దక్కింది. ఏప్రిల్ 2022లో అత్యంత ప్రజాదరణ పొంది 190 మిలియన్ల సోషల్ మీడియాఎంగేజ్‌మెంట్‌తో 2వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో 321 మిలియన్స్ ఎంగేజ్‌మెంట్‌తో ఫుట్‌బాల్ దిగ్గజ జట్టు రియల్ మాడ్రిడ్ మొదటి స్థానంలో ఉంది. అటు 179 మిలియన్స్‌ ఎంగేజ్‌మెంట్‌తో ఎఫ్‌సి బార్సిలోనా జట్టు మూడో స్థానంలో ఉంది.

Umran Malik: 14 మ్యాచ్‌లు ఆడి రూ.14 లక్షలు సంపాదించాడు

కాగా ఈ సీజన్‌ ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఓవరాల్ ఐపీఎల్‌లో చూసుకుంటే ఇప్పటివరకు అత్యధిక సార్లు ప్లే ఆఫ్స్ చేరిన జట్లలో ఆర్సీబీ మూడో స్థానంలో ఉంది. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ఇప్పటివరకు 11 సార్లు ప్లే ఆఫ్స్ చేరింది. రెండో స్థానంలో ముంబై ఇండియన్స్ ఉంది. ఈ జట్టు 9 సార్లు ప్లే ఆఫ్స్ చేరగా.. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు 8 సార్లు ప్లే ఆఫ్స్‌ చేరింది. అయితే ఆర్సీబీతో సమానంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టు కూడా 8 సార్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడం విశేషం.

Exit mobile version