NTV Telugu Site icon

డబ్ల్యూటీసీ ఫైనల్స్ కోసం టీంఇండియా కొత్త జెర్సీ…

జూన్‌ 18 నుంచి 22 వరకు సౌథాంప్టన్‌ వేదికగా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో ఇండియా-న్యూజిలాండ్ పోటీ పడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ వెళ్లనున్న భారత జట్టు ప్రస్తుతం ముంబైలో క్వారంటైన్ లో ఉంది. అదోలా ఉంటె… ఈ ఫైనల్లో టీమిండియా కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఆ జెర్సీ 1990వ కాలం నాటి భారత జట్టు ధరించిన రెట్రో జెర్సీను గుర్తు చేస్తుంది. దీనికి సంబంధించిన ఫొటోను టీమిండియా ఆల్​ రౌండర్ రవీంద్ర​ జడేజా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ‘రివైండ్​ టు 1990’అని క్యాప్షన్‌ ఇచ్చాడు. అయితే ఈ జెర్సీపై బీసీసీఐ లోగోతో పాటు ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ 2021, ఇండియా అని మాత్రమే ఉంది. ఇది ఐసీసీ ఈవెంట్ కావడంతో స్పాన్సర్లు లేరని తెలుస్తోంది. ఇక ఈ మ్యాచ్ అభిమానుల మధ్య జరగనున్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈ మ్యాచ్ కు 4000 మందికి అనుమతి ఇచ్చింది.