NTV Telugu Site icon

Ravindra Jadeja: జడేజానా మజాకా.. తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర

Jadeja Record In Tests

Jadeja Record In Tests

Ravindra Jadeja Creates New Record in Tests: ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో రవీంద్ర జడేజా తన ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీయడంతో పాటు 48 పరుగులు చేసి కీలక పాత్ర పోషించిన జడేజా.. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే అతడు ఓ అరుదైన రికార్డ్‌ని నమోదు చేశాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డ్ భారత మాజీ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ పేరిట ఉండేది. ఆయన తన టెస్టు కెరీర్‌లో మొత్తం 266 వికెట్లు పడగొట్టాడు. జడేజా మొత్తంగా 268 వికెట్లు పడగొట్టి, ఆయన రికార్డ్‌ని బద్దలుకొట్టాడు. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే.. రంగనా హెరాత్ 433 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆయన తర్వాత డేనియల్‌ వెటోరి(362 వికెట్లు), డ్రీక్‌ అండర్‌వుడ్‌(298 వికెట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. జడేజా(268 వికెట్లు), బిషన్‌ సింగ్‌ బేడీ(266 వికెట్లు) వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు.

Fire Accident in Eluru Railway Station: ఏలూరు రైల్వేస్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

కేవలం భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితా విషయానికొస్తే.. అనిల్ కుంబ్లే 619 వికెట్లు అగ్రస్థానంలో ఉన్నాడు. ఆయన తర్వాత అశ్విన్‌(474 వికెట్లు), కపిల్‌ దేవ్‌(434 వికెట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. హర్బజన్‌(417 వికెట్లు), ఇషాంత్‌ శర్మ, జహీర్‌ ఖాన్‌లు 311 వికెట్లతో నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నారు. రవీంద్ర జడేజా తాజా పెర్ఫార్మెన్స్‌తో ఏడో స్థానానికి చేరుకున్నాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ విషయానికొస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 270/8 స్కోరు వద్ద డిక్లేర్ ప్రకటించారు. దీంతో.. తొలి ఇన్నింగ్స్‌లో మిగిలిన పరుగులతో కలిపి మొత్తంగా 444 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు నిర్దేశించారు. తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకే ఆలౌట్ అయిన భారత్‌కి ఇది పెద్ద పెద్ద లక్ష్యమేనని చెప్పుకోవాలి. మరి, భారత్ ఆ లక్ష్యాన్ని ఛేధించగలుగుతుందా? లేదా? అనేది చూడాలి.

Telugu heros : పారితోషకం విషయంలో తెలుగు హీరోల ఆలోచన మారాలి అంటున్న నిర్మాతలు..?