NTV Telugu Site icon

Ravichandran Ashwin: చరిత్ర సృష్టించిన అశ్విన్‌.. ఆ ఘనత సాధించిన తొలి భారత బౌలర్

Ashwin World Record

Ashwin World Record

Ravichandran Ashwin Creates Sensational Record: భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక ఐదు వికెట్ల హాల్స్‌ సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లోని తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు సాధించడంతో.. అశ్విన్ ఈ రికార్డ్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. భారత గడ్డపై ఆయన టెస్టుల్లో 25 సార్లు ఐదు వికెట్ల హాల్స్ నమోదు చేశారు. ఇప్పుడు తాజా మ్యాచ్‌తో 26వ సారి 5 వికెట్ల హాల్ సాధించి, కుంబ్లే రికార్డ్‌ని అశ్విన్ బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా అశ్విన్‌కి ఇది 32వ ఐదు వికెట్ల హాల్ కావడం విశేషం. ఇదే సమయంలో అశ్విన్ మరో సంచలన రికార్డ్‌ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా అశ్విన్‌ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు 111 వికెట్లతో అనిల్ కుంబ్లే పేరిట ఆ రికార్డ్ ఉండగా.. 113 వికెట్లతో అశ్విన్ ఆ రికార్డ్‌ని పటాపంచలు చేశాడు. భారత బౌలర్లలో ఈ ఇద్దరు మినహా మరెవ్వరు ఆస్ట్రేలియాపై 100 వికెట్లకు మించి తీయలేదు.

Dolo 650: డోలో 650 తయారీ సంస్థకు క్లీన్ చీట్ ఇచ్చిన ఫార్మా అసోసియేషన్.. కానీ..

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 480 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా(180), కామెరాన్ గ్రీన్(114) సెంచరీలతో చెలరేగడం వల్లే.. ఈ జట్టు ఇంత భారీ స్కోర్ చేయగలిగింది. టాడ్‌ మర్ఫీ సైతం 41 పరుగులతో ఆకట్టుకున్నాడు. భారత బౌలర్ల విషయానికొస్తే.. అశ్విన్ ఆరు వికెట్లతో చెలరేగగా, మహమ్మద్ షమీ రెండు వికెట్లు, రవీంద్ర జడేజా & అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు. ప్రస్తుతం భారత జట్టు బ్యాటింగ్ చేస్తోంది. రెండో రోజు ఆటను ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 36 పరుగులతో ముగించింది.

Huge Train: అబ్బో ఎంత పెద్ద రైలో దీన్ని లాగాలంటే నాలుగైదు ఇంజన్లు కావాల్సిందే

Show comments