నిన్నటితో యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 లో భారత జట్టు ప్రయాణం ముగిసింది. అయితే ఈ ప్రపంచ కప్ ప్రారంభానికి ముందే తాను ఈ టోర్నీ తర్వాత టీం ఇండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుండి తొలిగిపోతానని కోహ్లీ చెప్పిన విషయం తెలిసిందే. దాంతో ఆ తర్వాత కెప్టెన్ ఎవరు అనే దాని పైన చర్చలు మొదలయ్యాయి. అందులో ముఖ్యంగా రోహిత్ శర్మ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. ఇక నిన్నటితో టీం ఇండియా హెడ్ కోచ్ బాధ్యతల నుండి వైదొలిగిన రవిశాస్త్రి కూడా ఇదే మాటలు చెప్పాడు. టీ20ఐ క్రికెట్‌లో భారత క్రికెట్ ను మరింత ఎత్తుకు తీసుకెళ్లగల సామర్థ్యం రోహిత్ శర్మకు ఉందని రవిశాస్త్రి అన్నారు. రోహిత్‌లో మనకు ఒక సమర్థుడైన కెప్టెన్ ఉన్నాడు. అతను ఇప్పటికే చాలా ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకున్నాడు. అంతేకాకుండా అతను చాలా కాలంగా ఈ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు’ అని శాస్త్రి అన్నారు.
టీ20 కెప్టెన్ గా రోహిత్ సమర్ధుడు : రవిశాస్త్రి
