Site icon NTV Telugu

PBKS vs RR: మూడు వికెట్లు పడినా, జోరు మీదే రాజస్థాన్.. 10 ఓవర్లలో స్కోరు ఇది

Rajasthan 10 Overs Innings

Rajasthan 10 Overs Innings

PBKS vs RR: బర్సాపర స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో ఆడుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ లక్ష్యం దిశగా దూసుకుపోతోంది. 10 ఓవర్లు ముగిసే సమయానికి ఈ జట్టు మూడు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. మ్యాచ్ ప్రారంభమైనప్పుడు రాజస్థాన్‌కి రెండు పెద్ద ఝలక్‌లే తగిలాయి. యశస్వీ జైస్వాల్ (11), అశ్విన్ (0) వికెట్లు వెనువెంటనే పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన విధ్వంసకర ఆటగాడు జాస్ బట్లర్ కూడా కేవలం 19 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే మంచి జోష్‌లో కనిపించిన ఇతగాడు.. ఈసారి కూడా భారీ ఇన్నింగ్స్ ఆడుతాడని ఆశిస్తే.. నథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఒక రకంగా ఇది బట్లర్ దురదృష్టమనే చెప్పుకోవాలి. అతడు షాట్ కొట్టబోతే, అది అతని ప్యాడ్‌కి తగిలి గాల్లో ఎగిరింది. దీంతో.. ఎల్లిస్ పరుగెత్తుకుంటూ వచ్చి, సునాయాసంగా క్యాచ్ పట్టుకున్నాడు.

Shweta Basu Prasad: ‘కొత్త బంగారు లోకం బ్యూటీ’ ఎద అందాల ప్రదర్శన..అదిరింది

అశ్విన్ ఔట్ అవ్వగానే క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్.. రావడం రావడంతోనే పరుగుల వర్షం కురిపించాడు. ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసినా, బంతుల్ని తనకు అనుకూలంగా మార్చుకొని బౌండరీలు బాదాడు. ఒత్తిడికి గురవ్వకుండా, లక్ష్యం దిశగా జట్టుని తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో.. పరుగుల వర్షం కురిపించడంలోనే దృష్టి సారించాడు. ఇతని పుణ్యమా అని.. రాజస్థాన్ జట్టు స్కోరు పరుగులు పెట్టిందని చెప్పుకోవచ్చు. దేవ్‌దత్ పడిక్కల్ అతనికి మద్దతుగా నిలిచాడే తప్ప.. ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. బౌలర్లలో అర్ష్‌దీప్ తొలి రెండు వికెట్లు తీయగా.. నథన్ ఎల్లిస్ బట్లర్ వికెట్ పడగొట్టాడు. పది ఓవర్ల వరకు రాజస్థాన్ మంచి పోరాట పటిమనే కనబర్చింది. మిగిలిన పది ఓవర్లలో 108 పరుగులు చేయాలి. మరి.. రాజస్థాన్ లక్ష్యాన్ని ఛేధిస్తుందా? లేదా? వేచి చూడాల్సిందే!

Aditi Rao Hydari: మైమరుపా.. మెరుపా.. నిన్నిలా చూస్తే

Exit mobile version