NTV Telugu Site icon

RCB vs RR: ముగిసిన ఆర్సీబీ బ్యాటింగ్.. ఆర్ఆర్ లక్ష్యం ఎంతంటే?

Rcb 20 Overs

Rcb 20 Overs

Rajasthan Royals Need To Score 172 Runs To Win Against RCB: జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ ఇండోర్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (55), మ్యాక్స్‌వెల్ (54) అర్థశతకాలతో రాణించడం.. చివర్లో అనూజ్ రావత్ (29) మెరుపులు మెరిపించడంతో.. ఆర్సీబీ అంత స్కోరు చేయగలిగింది. వీళ్లు ముగ్గురు మినహాయించి.. ఆర్సీబీ బ్యాటర్లలో ఏ ఒక్కరూ ఆశాజనకమైన ఇన్నింగ్స్ ఆడలేదు. కోహ్లీ మరోసారి టెస్ట్ ఇన్నింగ్స్‌తో నిరాశపరిచాడు. 19 బంతుల్లో కేవలం 18 పరుగులే చేశాడు. పవర్ హిట్టర్ లామ్రోర్ 1 పరుగు చేసి ఔట్ అవ్వగా.. దినేశ్ కార్తిక్ డకౌట్‌గా వెనుదిరిగాడు. రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. 172 పరుగుల లక్ష్యాన్ని ఛేధించాలి.

Samyuktha Menon: పాడు పని చేసిన వ్యక్తి.. చెంప పగలగొట్టిన సంయుక్త

తొలుత ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే, ఆర్సీబీకి ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. దీంతో.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నారు కాబట్టి, దుమ్ముదులిపేస్తారని అనుకున్నారు. ఓపెనర్లుగా వచ్చే కోహ్లీ, డు ప్లెసిస్ ఊచకోత కోస్తారని భావించారు. కానీ.. అందుకు భిన్నంగా ఆ ఇద్దరు నిదానంగా ఇన్నింగ్స్ ఆడారు. డు ప్లెసిస్ అప్పుడప్పుడైనా బౌండరీలతో సంతోషపరిచాడు కానీ, కోహ్లీ మాత్రం టోటల్‌గా డిజప్పాయింట్ చేశాడు. పరుగుల సునామీ సృష్టించాల్సిన పవర్ ప్లేలో అతడు సింగిల్స్, డబుల్స్‌తోనే సర్దుబాటు చేసుకున్నాడు. పవర్‌ప్లేలో ఈ జోడీ కేవలం 42 పరుగులే చేసింది. ఇక కోహ్లీ ఖాతా తెరవాలని అనుకున్న సమయంలో.. క్యాచ్ ఔట్ అయ్యాడు. అతని తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్.. వచ్చి రావడంతోనే ఆర్ఆర్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన 360 డిగ్రీ ఆటతో మైదానంలో కాసేపు పరుగుల వర్షం కురిపించాడు. డు ప్లెసిస్, మ్యాక్స్‌వెల్ కలిసి రెండో వికెట్‌కి 69 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.

Fakes Kidnapping: పరీక్షల్లో ఫెయిల్ అయింది.. కిడ్నాప్ డ్రామాకు తెర లేపింది..

అయితే.. అర్థశతకం చేసుకున్నాక డు ప్లెసిస్ క్యాచ్ ఔట్ అయ్యాడు. అనంతరం లామ్రోర్, దినేశ్ కార్తిక్ అతని వెంటే పెవిలియన్ బాట పట్టారు. ఆ కొద్దిసేపటికే మ్యాక్స్‌వెల్ రివర్స్ స్వీప్ షాట్ ప్రయత్నించి, సందీప్ శర్మ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. చివర్లో అనూజ్ రావత్ మెరుపులు మెరిపించాడు. తద్వారా ఆర్సీబీ స్కోరు 171/5గా నమోదైంది. ఆర్ఆర్ బౌలర్ల విషయానికొస్తే.. అసిఫ్, జంపా చెరో రెండు వికెట్లు తీయగా, సందీప్ శర్మ ఒక వికెట్ పడగొట్టాడు.