Site icon NTV Telugu

IPL 2022: ఐపీఎల్‌లో రికార్డు సృష్టించిన చాహల్

Chahal

Chahal

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ రికార్డు సృష్టించాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా అరుదైన ఫీట్‌ సాధించాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో హార్డిక్ పాండ్యాను ఔట్‌ చేసి 27వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా పర్పుల్‌ క్యాప్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఇమ్రాన్‌ తాహిర్‌ 26 వికెట్లు తీయగా.. ఇప్పుడు తాహిర్ రికార్డును బ్రేక్‌ చేసి తొలి స్థానానికి చాహల్ దూసుకెళ్లాడు.

IPL 2022: నయా ఛాంపియన్స్‌గా గుజరాత్ టైటాన్స్

మరోవైపు గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్ ఫెర్గూసన్ సన్‌రైజర్స్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ఈ సీజన్‌లో ఆడిన ప్రతి మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ డెలివరీ వేసిన బౌలర్‌గా ఉమ్రాన్ మాలిక్ నిలవగా.. ఫైనల్ మ్యాచ్‌లో తాను వేసిన తొలి ఓవర్‌లోనే ఫెర్గూసన్ 157.3 kmph స్పీడ్‌తో బంతిని విసిరాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వేగంతో బంతిని విసిరిన ఆటగాడిగా షాన్ టైట్ పేరిట ఉన్న ఈ రికార్డును లోకీ ఫెర్గూసన్ సమం చేశాడు. ఆ తర్వాతి స్థానంలో ఉమ్రాన్ మాలిక్ కొనసాగుతున్నాడు.

Exit mobile version