Site icon NTV Telugu

IND Vs SL: రెండో టీ20కి వర్షం ముప్పు.. టీమిండియా విజయాలకు బ్రేక్ పడుతుందా?

ధర్మశాల వేదికగా శనివారం రాత్రికి టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య రెండో టీ20 జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ధర్మశాలలో ఆకాశమంతా మబ్బులు కమ్ముకున్నాయి. మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. సాయంత్రానికి వర్షం ఆగిపోయినా మబ్బులు ఉంటాయన్నారు. పైగా ఆదివారం జరిగే మూడో మ్యాచ్‌పైనా వాతావరణ ప్రభావం ఉండొచ్చని తెలిపారు.

కాగా టీ20లలో టీమిండియా జోరు మీద ఉంది. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో టీమ్‌ఇండియా 24 మ్యాచ్‌లు ఆడగా వాటిలో 22 విజయాలు సాధించింది. ఇటీవల శ్రీలంకపై తొలి టీ20లో విజయం సాధించడంతో టీమిండియా వరుసగా 10 టీ20లు గెలిచింది. రెండో మ్యాచ్‌లోనూ గెలిస్తే ఆ సంఖ్య 11కి చేరే అవకాశం ఉంది. కానీ క్రికెట్ అభిమానులకు వాతావరణం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు శ్రీలంక జట్టు ఇండియాలో ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవలేదు. 2009లో తొలిసారి టీ20 సిరీస్ ఆడగా… 1-1తో డ్రా చేసుకున్నారు. ప్రస్తుతం శ్రీలంక జట్టులోనూ కీలక ఆటగాళ్లు గాయపడ్డారు. అందుకే గెలుపు అవకాశాలైతే మనకే ఎక్కువగా ఉన్నాయి.

Exit mobile version