Site icon NTV Telugu

Rahul Dravid: వినూ మన్కడ్ ట్రోఫీలో కర్ణాటక జట్టుకు కెప్టెన్‌గా రాహుల్ ద్రవిడ్ కొడుకు

Rahul

Rahul

Rahul Dravid: టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ క్రికెట్‌లో అద్భుతమైన ఆట తీరును కనబరుస్తున్నాడు. అండర్-19 వన్డే టోర్నమెంట్ అయినా వినూ మన్కడ్ ట్రోఫీ కోసం ప్రకటించిన కర్ణాటక జట్టుకు అన్వయ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇక, యువ క్రికెటర్లకు తమ సత్తాను నిరూపించుకోవడానికి వినూ మన్కడ్ ట్రోఫీ ఒక వేదిక అని చెప్పాలి. ఈ టోర్నమెంట్‌లో అన్వయ్‌కు కెప్టెన్సీ దక్కడం అతను స్థిరమైన ప్రదర్శనను తెలియజేస్తోంది. 18 ఏళ్ల అన్వయ్ గత సీజన్‌లో కర్ణాటకకు అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు.

Read Also: Adivi Sesh : అడివిశేష్ ‘డెకాయిట్’ క్రిస్మస్ రిలీజ్ వాయిదా..

అద్భుతమైన ఫామ్:
ఇటీవలి కాలంలో అన్వయ్ ద్రవిద్ ప్రదర్శన అత్యద్భుతంగా ఉంది. అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో అతను వరుసగా రెండో సీజన్‌లో కూడా కర్ణాటక రన్ ఛార్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచాడు. కేవలం ఆరు మ్యాచ్‌ల్లోనే 459 పరుగులు చేసి, 91.80 సగటుతో అద్భుతంగా రాణించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. అన్వయ్ స్థిరమైన బ్యాటింగ్ తో కర్ణాటక క్రికెట్లో కీలకంగా మారిపోయాడు.

వినూ మన్కడ్ ట్రోఫీకి కర్ణాటక జట్టు:
అన్వయ్ ద్రవిడ్ (కెప్టెన్, వికెట్ కీపర్), నితీష్ ఆర్య, ఆదర్శ్ డి ఉర్స్, ఎస్. మణికంఠ్ (వైస్ కెప్టెన్), ప్రణీత్ శెట్టి, వాసవ్ వెంకటేష్, అక్షత్ ప్రభాకర్, సి. వైభవ్, కులదీప్ సింగ్ పురోహిత్, రతన్ బి.ఆర్, వైభవ్ శర్మ, కేఏ తేజస్, అథర్వ్ మాలవీయ, సన్నీ కంచి మరియు రెహాన్ మహమ్మద్ (వికెట్ కీపర్).

Read Also: FAPTO Protest: విజయవాడలో ఫ్యాప్టో (FAPTO) ఆందోళన.. డిమాండ్లు ఇవే..

రంజీ ట్రోఫీ జట్టులో కరుణ్ నాయర్ రీఎంట్రీ:
ఇదిలా ఉండగా, సీనియర్ రంజీ ట్రోఫీకి కూడా కర్ణాటక తమ జట్టును ప్రకటించింది. మయాంక్ అగర్వాల్ కెప్టెన్‌గా కొనసాగనుండగా, కీలక ప్లేయర్ కరుణ్ నాయర్ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. ఈ జట్టులో ఆర్ స్మరణ్, కేఎల్ శ్రీజిత్, శ్రేయస్ గోపాల్, వైశాఖ్ విజయకుమార్, విద్వత్ కావేరప్ప, అభిలాష్ శెట్టి లాంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు.

Exit mobile version