Site icon NTV Telugu

అందరికి అవకాశం ఇస్తా : ద్రావిడ్

శ్రీలంకలో పర్యటించే భారత జట్టుకు రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు 20
మంది ఆటగాళ్లతో కూసిన జట్టును ఎంపిక చేసింది. అయితే ఈ పర్యటన పై తాజాగా రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ… నేను ‘భారత్-ఏ, అండర్-19 కోచ్‌గా ఉన్నప్పుడు జట్టుకు ఎంపికైన ఆటగాళ్లందరికీ అవకాశం ఇస్తానని ముందే చెప్పేవాడిని. మ్యాచుల్లో అవకాశం దొరక్కపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు బెంచ్ మీదు కూర్చుంటే కలిగే బాధను చెప్పలేం. అందుకే నేను 11 మంది కాకుండా అత్యుత్తమ 15 మంది ఆడతారని చెబుతా. అండర్‌-19లో వీలైతే ప్రతి మ్యాచ్‌కు ఐదారు మార్పులు చేసేవాడిని. ఇప్పుడు కూడా లంక పర్యటనలో ప్రతి ఆటగాడికి అవకాశం ఇస్తాను అని ద్రవిడ్‌ చెప్పుకొచ్చాడు.

Exit mobile version