టీ20 ప్రపంచకప్ ముగియగానే న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ సందర్భంగా మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఇప్పటికే టీ20 సిరీస్‌కు విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వగా.. అతడు తొలి టెస్టుకు కూడా దూరంగానే ఉంటాడని తెలుస్తోంది. మరోవైపు టీ20లకు కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉండనున్నాడు. దీంతో తొలి టెస్టుకు వైస్ కెప్టెన్ రహానె సారథ్యం వహించనున్నాడు. రెండో టెస్టు నుంచి కోహ్లీ అందుబాటులోకి వస్తాడని.. ఆ టెస్టుకు అతడే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
Read Also: పబ్‌జీ గేమ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్
కాగా టెస్టు సిరీస్‌కు రోహిత్ శర్మతో పాటు బుమ్రా, షమీ, శార్దూల్ ఠాకూర్, రిషబ్ పంత్ కూడా దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే వారు ఈ విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. నెలల తరబడి ఆటగాళ్లు బయో బబుల్‌లో ఉండటంతో పలువురికి విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ కూడా యోచిస్తోంది. కాగా ఆటగాళ్లు ఐపీఎల్‌కు ప్రాధాన్యం ఇస్తూ అంతర్జాతీయ మ్యాచ్‌లను పక్కన పెడుతున్నారంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. డబ్బుకు ఇస్తున్న విలువ దేశానికి ఇవ్వడం లేదని వాళ్లు ఆరోపిస్తుండటం గమనార్హం.
