NTV Telugu Site icon

R Sridhar : అశ్విన్ అలా అనేసరికి షాకయ్యా: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్

Ash

Ash

టీమిండియా మాజీ స్పిన్నర్ ఆర్ శ్రీధరన్ ఏడేళ్ల పాటు బారత జట్టుకు పీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. 2021లో ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. ఈ సమయంలో తన ఎక్స్‌పీరియన్స్, ఎదుర్కొన్న సవాళ్లను ఓ పుస్తకం రూపంలో రాశాడు, ‘కోచింగ్ బియాండ్: మై డేస్ విత్ ద ఇండియన్ క్రికెట్ టీమ్‌’ అనే బుక్‌లో ఇప్పటి వరకూ క్రికెట్ ఫ్యాన్స్‌కు తెలియని ఎన్నో ఆశ్చర్యకర విషయాలు కూడా ఉన్నాయి. తాజాగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో తాను తొలిసారి మాట్లాడిన సందర్భంలో జరిగిన ఓ విషయం గురించి చెప్పాడు. ఫీల్డింగ్ కోచ్ మారినప్పుడల్లా ఏదో ఒక కొత్తది చెబుతుంటారని, మీ మాట నేను ఎందుకు వినాలని అశ్విన్ అడిగినప్పుడు తాను ఆశ్చర్యానికి గురైనట్లు ఈ పుస్తకంలో శ్రీధర్ వివరించాడు.

ICC Awards: ఐసీసీ వన్డే, టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ఎవరంటే?

“నేషనల్ టీమ్‌తో కలిసిన తొలి వారంలోనే అశ్విన్‌తో మాట్లాడినప్పుడు నేను కాస్త షాక్‌కు గురయ్యా. అతడు మామూలుగానే నన్నో విషయం అడిగాడు. మీరు ఏమీ అనుకోకపోతే శ్రీధర్ సర్.. నేను మీరు చెప్పింది ఎందుకు వినాలి. మీరు చెప్పిన ఫీల్డింగ్ డ్రిల్స్ ఎందుకు ఫాలో కావాలి? 2011 నుంచి 2014 వరకు ట్రెవర్ పెన్నీ ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్నాడు. ఇప్పుడు మీరు వచ్చారు. మీరు మరో రెండు, మూడేళ్లు ఉంటారేమో. మీరు ఏదో చెబుతారు. వెళ్లిపోతారు. అప్పుడు మరో కొత్త ఫీల్డింగ్ కోచ్ వస్తాడు. నిజాయతీగా చెప్పాలంటే తర్వాత మూడేళ్లు నాకు చాలా ముఖ్యం. మీరు చెప్పింది నాకు ఉపయోగపడుతుందని నేను నమ్మాలి. అది నా ఆటకు సాయం చేయాలి. లేదంటే నేను ఎందుకు వినాలి అని అశ్విన్ నన్ను అడిగాడు” అని శ్రీధర్ తన పుస్తకంలో వెల్లడించాడు.

MS Dhoni: ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఇక తగ్గేదే లే

అయితే అశ్విన్ అలా మాట్లాడటం వల్ల అప్పటి వరకూ తాను పని చేసిన విధానంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉన్న విషయం తనకు అర్థమైనట్లు శ్రీధర్ చెప్పాడు. అప్పటికే అశ్విన్ గురించి తనకు బాగా తెలుసుని, అతడు ఆ ప్రశ్నలు అడిగిన తర్వాత.. అసలు కోచింగ్ అంటే ఏంటి? ఎంతవరకూ నేను కోచింగ్ ఇవ్వాలి అన్న ప్రశ్నలు తనకు తాను వేసుకున్నట్లు శ్రీధర్ తన పుస్తకంలో రాసుకొచ్చాడు.