ICC Awards: ఐసీసీ వన్డే, టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతేడాది అద్భుత ప్రదర్శనతో మెప్పించిన మేటి ఆటగాళ్ల పేర్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించింది. ఇప్పటికే ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా సూర్యకుమార్, ఎమర్జింగ్ విమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా రేణుకా సింగ్ పేర్లను ప్రకటించింది ఐసీసీ. తాజాగా గురువారం వన్డే, టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌తో పాటు అంపైర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల్ని వెల్లడించింది. కాగా, 2022 ఏడాదికి గానూ ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌కు దక్కింది. గతేడాది 9 వన్డేల్లో 84.87 సగటుతో 679 పరుగులు చేసిన బాబర్ ఖాతాలో మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బాబర్ వరుసగా రెండో ఏడాది ఈ అవార్డు దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం బాబర్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో(బ్యాటింగ్ విభాగం) నెంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. 2021 జూలైలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. ఇక వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రేసులో నిలిచిన ఆడమ్ జంపా, సికిందర్ రజా, వెస్టిండీస్ ఓపెనర్ షై హోప్‌ల కంటే ఎక్కువ ఓట్లు దక్కించుకొని బాబర్ తొలి స్థానంలో నిలిచాడు. ఎంఎస్ ధోనీ, ఏబీ డివిల్లియర్స్, విరాట్ కోహ్లీ తర్వాత వరుసగా రెండో ఏడాది వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుడు సొంతం చేసుకున్న ఆటగాడిగా బాబర్ రికార్డు క్రియేట్ చేశాడు. మహిళల విభాగంలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ నటాలియా సీవర్ విమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది.
Oneplus Event: వన్ ప్లస్ లాంచ్ ఈవెంట్ వచ్చేస్తోంది.. సరికొత్త ఫోన్లు, ప్రొడక్ట్స్‌తో!
Also Read
- US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
- India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
కాగా, ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఐసీసీ మెన్స్ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కైవసం చేసుకున్నాడు. నిరుడు ఈ ఫార్మాట్లో 36.25 సగటుతో 870 రన్స్ చేసిన స్టోక్స్.. 26 వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే ఇంగ్లాండ్ టెస్టు పగ్గాలు అందుకున్నప్పటి నుంచి 10 టెస్టుల్లో 9 విజయాలు అందించాడు. ఇకపోతే, ఇంగ్లాండ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వార్త్.. ఐసీసీ 2022 అంపైర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు. ఇతడికి ఈ అవార్డు రావడం ఇది రెండోసారి. గతంలో 2019లోనూ ఇల్లింగ్‌వార్త్ విజేతగా నిలిచాడు. సౌతాఫ్రికా యంగ్ ఫాస్ట్ బౌలర్ మార్కో జాన్సెన్ ఐసీసీ మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు కైవసం చేసుకున్నాడు. గతేడాది 36 టెస్టు వికెట్లు తీసిన మార్కో జాన్సెన్.. వన్డేల్లో రెండు, టి20ల్లో ఒక వికెట్ తీశాడు. బ్యాటింగ్‌లో 234 పరుగులు సాధించాడు.
ఐసీసీ అవార్డులు-2022
మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – సూర్యకుమార్ (భారత్)
విమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – తహ్లియా మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా)
మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – మార్కో జాన్సెస్ (సౌతాఫ్రికా)
విమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – రేణుకా సింగ్ (భారత్)
మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – బాబర్ అజామ్ (పాకిస్తాన్)
విమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – నటాలియా సీవర్ (ఇంగ్లాండ్)
మెన్స్ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్)
అంపైర్ ఆఫ్ ది ఇయర్ – రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లాండ్)
తాజావార్తలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!