భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. సింగపూర్ ఓపెన్-2022 విజేతగా నిలిచింది. ఆదివారం ఉదయం జరిగిన మహిళల సింగిల్ ఫైనల్స్‌లో చైనా ప్లేయర్ వాంగ్ జి యీని 21-9, 11-21, 21-15 తేడాతో పీవీ సింధు ఓడించింది. ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. ప్రారంభసెట్‌ను సింధు 12 నిమిషాల్లోనే ముగించింది. దీంతో 21-9తో తొలి సెట్‌ను సింధు గెలవగా రెండో సెట్‌ను 21-11 తేడాతో వాంగ్ జి యీ గెలిచింది. దీంతో మూడో సెట్లో సింధుతన సర్వశక్తులు ఒడ్డింది. దీంతో తొలిసారిగా సింగపూర్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకుంది. ఈ ఏడాది పీవీ సింధుకు ఇది మూడో టైటిల్. ఇప్పటికే 2022లో ఆమె కొరియా ఓపెన్, స్విస్ ఓపెన్ టైటిళ్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే.
Read Also: Corona Vaccination: ఇండియా రికార్డ్ .. వ్యాక్సిన్ కార్యక్రమంలో 200 కోట్ల డోసులు పూర్తి
Shuttler PV Sindhu wins her maiden Singapore Open title by defeating China's Wang Zhi Yi
(file pic) pic.twitter.com/I74tU8Yoc2
— ANI (@ANI) July 17, 2022