Punjab Kings Won The Match By 31 Runs Against Delhi Capitals: అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయం పాలైంది. పంజాబ్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ ఛేధించలేకపోయింది. 136 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో.. పంజాబ్ కింగ్స్ 31 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. నిజానికి.. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఫిల్ సాల్ట్ కలిసి ప్రారంభంలో కురిపించిన పరుగుల వర్షం చూసి.. ఢిల్లీ జట్టు సునాయాసంగా లక్ష్యాన్ని ఛేధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఎప్పుడైతే ఫిల్ సాల్ట్ ఔట్ అయ్యాడో.. అప్పటి నుంచి ఢిల్లీ పతనం మొదలైంది. అదేదో పెళ్లి భోజనాలకు పరుగులు తీసినట్టు.. ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ బాట పట్టారు. ఎవ్వరూ నిలకడగా రాణించలేకపోయారు. పంజాబ్ బౌలర్ల ధాటికి వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో.. రన్ రేటు పెరిగిపోతూ వచ్చింది. ఇక చివర్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడే బ్యాటర్లూ లేకపోవడంతో, 136 పరుగులకే ఢిల్లీ చాపచుట్టేయాల్సి వచ్చింది.
BJP out From South India: సౌత్ నుంచి బీజేపీ ఔట్..! మరీ దారుణం..
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (65 బంతుల్లో 103) సెంచరీతో చెలరేగడం వల్లే పంజాబ్ జట్టు అంత స్కోరు చేయగలిగింది. అనంతరం 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులకే తట్టాబుట్టా సర్దేసింది. మొదట్లో వార్నర్, సాల్ట్ కలిసి తమ జట్టుకి శుభారంభాన్నే అందించారు. పవర్ ప్లేలో ఇద్దరు దంచికొట్టారు. ముఖ్యంగా.. వార్నర్ అయితే బౌండరీల మోత మోగించేశాడు. తొలి వికెట్‌కి వీళ్లు 69 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. వీళ్లు కొట్టిన కొట్టుడు చూసి.. ఢిల్లీ విజయం ఖాయమని దాదాపు అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ.. సాల్ట్ వికెట్ పడ్డాక అంతా తలక్రిందులైంది. ఒకరి తర్వాత మరొకరు వరుసగా ఔట్ అవుతూ వచ్చారు. అప్పటికే 27 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 54 పరుగులు చేసిన వార్నర్ అయినా జట్టుని ఆదుకుంటాడని అనుకుంటే.. అతడు కూడా 86 టీమ్ స్కోర్ వద్ద వికెట్ కోల్పోయాడు.
Telangana BJP: కర్ణాటకలో సీన్ రివర్స్.. తెలంగాణ కాషాయ నేతలకు షాక్..!
ఇంపాక్ట్ ప్లేయర్‌గా రంగంలోకి దిగిన మనీష్ పాండే ఎప్పట్లాగే ఉసూరుమనిపించాడు. సున్నా పరుగులకే ఔట్ అయ్యాడు. ఒక మ్యాచ్‌లో అర్థశతకంతో అందరినీ ఆశ్చర్యపరిచిన హకీమ్ ఖాన్ సైతం ఈసారి చేతులెత్తేశాడు. ఇలా మంచి బ్యాటర్లందరూ ఈసారి హ్యాండ్ ఇవ్వడంతో.. ఢిల్లీకి ఓటమి తప్పలేదు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. తన స్పిన్ మాయాజాలంతో ఢిల్లీ పతనాన్ని శాసించాడు. తన 4 ఓవర్ల కోటాలో 30 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. నథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో పంజాబ్ జట్టు తన ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకోగలిగింది. డీసీ ఇంటిదారి పట్టింది.
