Site icon NTV Telugu

IPL 2022: గుజరాత్ వరుస విజయాలకు పంజాబ్ బ్రేక్

Shikar Dhawan

Shikar Dhawan

ఐపీఎల్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు పంజాబ్ కింగ్స్ బ్రేక్ వేసింది. డీవై పాటిల్ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 144 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టుకు ఓపెనర్ శిఖర్ ధావన్ (62) మంచి ఆరంభం ఇచ్చాడు. మరో ఓపెనర్ బెయిర్ స్టో(1) త్వరగానే పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రాజపక్స(40) ధావన్‌కు మంచి సహకారం అందించాడు. రాజపక్స అవుటైనా ఆఖర్లో లివింగ్ స్టోన్(30) మెరుపులు మెరిపించడంతో మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గెలుపు సొంతం చేసుకుంది.

అంతకుముందు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. గుజరాత్ ఆటగాళ్లలో సాయి సుదర్శన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అతడు 50 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 64 పరుగులు చేసి తుదికంటా నాటౌట్‌గా నిలిచాడు. మిగిలిన బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో రబాడ నాలుగు వికెట్లు సాధించాడు. అర్షదీప్ సింగ్, రిషి ధావన్, లివింగ్‌స్టోన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో ఐదో స్థానానికి చేరింది. గుజరాత్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

 

Cricket: వెస్టిండీస్ కొత్త కెప్టెన్‌గా సన్‌రైజర్స్ స్టార్ ఆటగాడు

Exit mobile version