Site icon NTV Telugu

PBKS vs RR: త్రిల్లింగ్ మ్యాచ్ అంటే ఇది.. పోరాడి ఓడిన రాజస్థాన్

Pbks Vs Rr Won

Pbks Vs Rr Won

Punjab Kings Won By 5 Runs Against Rajasthan Royals: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా బర్సాపర స్టేడియం వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో.. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ఛేధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగులకే పరిమితం కావడంతో.. పంజాబ్ కింగ్స్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్‌లో 16 పరుగులు చేయాల్సి ఉండగా.. సామ్ కర్రన్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. రాజస్థాన్ బ్యాటర్లకు బౌండరీ కొట్టే అవకాశాన్ని ఇవ్వలేదు. చివరి బంతి ఫోర్ పోయినా.. అంతకుముందు ఐదు బంతులు కట్టుదిట్టంగా వేయడంతో, రాజస్థాన్‌ లక్ష్యానికి చేరుకోలేకపోయింది.

Cable Bridges: భారతదేశంలోని 10 అందమైన కేబుల్ బ్రిడ్జెస్

తొలుత రాజస్థాన్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంపిక చేసుకోవడంతో.. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఓపెనర్లిద్దరు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (60), శిఖర్ ధవన్ (86) శివాలెత్తడం.. మధ్యలో జితేశ్ శర్మ (27) కూడా మెరుపులు మెరిపించడంతో.. పంజాబ్ అంత భారీ స్కోరు చేయగలిగింది. ఇక 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఆదిలోనే రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. సంజూ శాంసన్ (42) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో.. రాజస్థాన్ తిరిగి ఊపిరి పీల్చుకుంది. అతడు పోయాక రాజస్థాన్ మళ్లీ కష్టాల్లో పడింది. ఒక దశలో రాజస్థాన్ ఇన్నింగ్స్ త్వరలోనే ముగుస్తుందని అనుకున్నారు. కానీ.. చివర్లో వచ్చిన హెట్‌మేయర్, ధ్రువ్ జురేల్ మళ్లీ ఆశలు చిగురించారు. భారీ షాట్లు బాది.. లక్ష్యానికి చేరువగా జట్టుకి తీసుకెళ్లారు.

PBKS vs RR: మూడు వికెట్లు పడినా, జోరు మీదే రాజస్థాన్.. 10 ఓవర్లలో స్కోరు ఇది

చివరి ఓవర్‌లో 16 పరుగులే చేయాల్సి ఉండగా.. ఆ ఇద్దరు జోరులో ఉండటం చూసి, కచ్ఛితంగా లక్ష్యాన్ని ఛేధిస్తారని అనుకున్నారు. కానీ.. సామ్ కర్రన్ లాస్ట్‌లో మలుపు తిప్పేశాడు. కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి.. ఆ ఇద్దరు విధ్వంసకర ఆటగాళ్లకు బౌండరీలు బాదే అవకాశం ఏమాత్రం ఇవ్వలేదు. ఇంతలోనే హెట్‌మేయర్ కూడా రనౌట్ అవ్వడంతో.. రాజస్థాన్ పని ముగిసింది. 2 బంతులకి 11 పరుగులు చేయాల్సి ఉండగా.. అతడు కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు. దీంతో.. 5 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్‌ని కైవసం చేసుకుంది.

Exit mobile version