Site icon NTV Telugu

DC vs PBKS: ఢిల్లీ క్యాపిటల్స్ వీరవిహారం.. పంజాబ్ ముందు భారీ లక్ష్యం

Dc 20 Overs Innings

Dc 20 Overs Innings

Punjab Kings Need To Score 214 Runs To Win The Match: పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వీరవిహారం చేసింది. ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో పరుగుల సునామీ సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. రుస్సో (37 బంతుల్లో 82) తాండవం చేయడం, అర్థశతకంతో పృథ్వీ షా (38 బంతుల్లో 54) రాణించడం, డేవిడ్ వార్నర్ (46) సైతం చితక్కొట్టడంతో.. ఢిల్లీ జట్టు ఇంత భారీ స్కోరు చేయగలిగింది. ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేయడంలో పంజాబ్ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. సామ్ కర్రన్ ఒక్కడే తన 4 ఓవర్ల కోటాలో 36 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లు మాత్రం భారీ పరుగులు సమర్పించుకున్నారు.

Gujarat: దారుణం.. గర్ల్‌ఫ్రెండ్‌పైనే అత్యాచారం.. పైశాచిక ప్రవర్తన

ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఓపెనింగ్ చేసిన డేవిడ్ వార్నర్, పృథ్వీ షా.. ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించారు. పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి.. బౌండరీల మోత మోగించారు. తొలి వికెట్‌కి వీళ్లిద్దరు 94 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇదే అత్యధిక తొలి వికెట్ పార్ట్నర్‌షిప్. 94 పరుగుల వద్ద వార్నర్ ఔటయ్యాక వచ్చిన రుస్సో సైతం వచ్చి రావడంతోనే తన బ్యాట్‌కి పని చెప్పాడు. ఎడాపెడా షాట్లతో మైదానంలో పరుగుల వర్షం కురిపించాడు. ఎలాంటి బంతులు వేసినా, వాటిని తనకు అనుకూలంగా మార్చుకొని బౌండరీల బాట పట్టించాడు. పంజాబ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టించాడు. పృథ్వీ షా అర్థశతకం చేసుకున్నాక విజృంభించాలని అనుకున్నాడు కానీ, ఆ జోష్‌లోనే అతడు ఔట్ అయ్యాడు.

Strange Incident: అంత్యక్రియల్లో విచిత్ర ఘటన.. చనిపోయిన భార్య కంట్లోంటి కన్నీళ్లు.. కట్ చేస్తే!

పృథ్వీ పెవిలియన్ చేరుకున్నాక.. ఫిల్ సాల్ట్, రుస్సో కలిసి పంజాబ్ బౌలర్లతో ఫుట్‌బాల్ ఆడుకున్నారు. ముఖ్యంగా.. రుస్సో అయితే తాండవం చేశాడు. నిజానికి.. రుస్సోని అయోమయానికి గురి చేయాలని పంజాబ్ బౌలర్లు తెలివిగా బౌలింగ్ వేసేందుకు ప్రయత్నించారు. కానీ.. వారి స్ట్రాటజీలను పసిగట్టిన రుస్సో, అందుకు తగ్గట్టుగానే తన ఆటతీరుని కొనసాగించాడు. ఫిల్ సాల్ట్ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివరివరకు వీళ్లిద్దరు క్రీజులో నిల్చొని దుమ్ముదులిపేశారు. తద్వారా ఢిల్లీ స్కోరు 200 మైలురాయిని దాటేసింది. ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. పంజాబ్ 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేధించాల్సి ఉంటుంది. మరి, పంజాబ్ ఛేధించగలదా?

Exit mobile version