Site icon NTV Telugu

Indian Olympic Association : భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలిగా పీటీ ఉష

Pt Usha

Pt Usha

Indian Olympic Association : భారత క్రీడాభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు పీటీ ఉష. పరుగుల రాణిగా పీటీ ఉష పేరొందారు. క్రీడారంగానికి ఆమె చేసిన సేవలు అమోఘం. అందుకు ఆమెను గౌరవిస్తూ భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలి పదవి కట్టబెట్టారు. దిగ్గజ అథ్లెట్‌, పరుగుల రాణి పీటీ ఉష భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ పదవికి వచ్చే నెల 10న ఎన్నికలు జరగాల్సి ఉంది. నామినేషన్లకు గడువు ఆదివారంతో ముగిసింది. అయితే ఉషకు పోటీగా వేరే వాళ్లెవరూ నామినేషన్‌లు దాఖలు చేయలేదు.

Read Also: Afghanistan: దారుణం.. పట్టెడన్నం పెట్టలేక బిడ్డలకు నిద్రమాత్రలిస్తున్న తల్లిదండ్రులు

Read Also: Fake CBI: ఢిల్లీలో ఫేక్ సీబీఐ అధికారి అరెస్ట్

దీంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సంఘం సభ్యులు ప్రకటించారు. దాంతో ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా పీటీ ఉష గుర్తింపు పొందారు. అంతేగాక మహారాజా యాదవీంద్ర సింగ్ (1934, క్రికెట్‌) తర్వాత ఈ బాధ్యతలు స్వీకరించిన తొలి స్పోర్ట్స్‌ పర్సన్‌గా కూడా పీటీ ఉష ఘనత దక్కించుకున్నారు. కాగా, 1984 ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హర్డిల్స్‌లో సెకనులో వందో వంతులో పతకం చేజార్చుకుని నాలుగో స్థానంలో నిలిచిన ఉష.. 1982, 1994 ఆసియా క్రీడల్లో 100, 200 మీటర్ల పరుగులో రెండేసి పసిడి పతకాలతో ఉష మెరిసింది. ఒక్క ఆసియా క్రీడల్లోనే ఆమె 14 స్వర్ణాలతోపాటు 23 పతకాలు గెలుచుకుంది.

Exit mobile version