Fake CBI: ఢిల్లీలో ఫేక్ సీబీఐ అధికారి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake CBI: పెద్ద రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు సైతం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్(సీబీఐ) అనగానే భయపడుతున్నారు. ప్రతీరోజు దేశంలో ఎక్కడో చోట సిబిఐ దాడులు, ఈడీ దాడులు అంటూ వార్తలు వినపడుతూనే ఉన్నాయి. ఈ సందర్భాన్ని వాడుకోవాలని ఓ వ్యక్తి ఏకంగా సీబీఐ అవతారం ఎత్తాడు. విశాఖ పట్నం చిన్నవాల్తేర్ కు చెందిన కొవ్విరెడ్డి శ్రీనివాస్ రావు ఫేక్ సీబీఐ అధికారిగా చెలామణీ అవుతూ వివిధ వ్యక్తుల నుంచి డబ్బును స్వీకరించాడు. ఈ నకిలీ సిబిఐ అధికారిని ఢిల్లీలోని తమిళనాడు భవన్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్టు చేసింది. నిందితుడు తనను తాను సీబీఐ ప్రధాన కార్యాలయంలో సీనియర్‌గా, రిటైర్డ్ ఐపీఎస్ అధికారిగా పరిచయం చేసుకునేవాడని విచారణలో తేలింది.
Read Also: Mauna Loa Volcano: 38ఏళ్ల తర్వాత బద్ధలైన ప్రపంచంలోని అతి పెద్ద అగ్ని పర్వతం
Also Read
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
నిందితుడికి ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాజకీయ నాయకులు, అధికార యంత్రాంగంలో మంచి పరిచయాలున్నట్లు సమాచారం. సిబిఐ పేరుతో అతను కోట్ల రూపాయల డీల్‌లు చేసినట్లు వస్తున్న ఆరోపణలపై కూడా సిబిఐ దృష్టి సారించింది. నిందితుని ఇళ్లలో సోదాలు నిర్వహించగా రూ. 21 లక్షల నగదు, బంగారు ఆభరణాలను సీబీఐ సీజ్ చేసింది. తమిళనాడులో ఒక డీల్‌కు సంబంధించి నకిలీ అధికారి చేసిన సంభాషణ, డబ్బులు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చినవారు సిబిఐకి సమాచారం ఇచ్చారు. దీంతో నిందితుడి ఆచూకీ కోసం సిబిఐ బృందం ఆదివారం రాత్రి ఢిల్లీలోని తమిళనాడు భవన్‌కు చేరుకుంది. ఈ క్రమంలో మూడో అంతస్తులో ఉన్న మరో వ్యక్తితో నిందితుడు మొబైల్ ద్వారా మాట్లాడుతున్నాడు. శ్రీనివాస్‌ను అతని మొబైల్ ఫోన్‌ను సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి మొబైల్ ఫోన్ ఆధారంగా కీలక సమాచారం రాబట్టే ఉన్నారు సీబీఐ అధికారులు. నకిలీ ఐపీఎస్ ఐడెంటిటీ కార్డు, విజిటింగ్ కార్డులు, కారుతో సహా పలు కీలక పత్రాలు, వస్తువులను సీబీఐ స్వాధీనం చేసుకుంది.
- Tags
- CBI
- cbi officer
- Delhi
- Fake CBI
- Phone
తాజావార్తలు
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!