Site icon NTV Telugu

Asia Cup: ఆసియా కప్‌ కోసం పాకిస్తాన్‌కు టీమిండియా వెళ్తుందా?.. ఆరోజు క్లారిటీ

India

India

ఈ ఏడాది జరగబోయే ఆసియా కప్‌ గురించి అభిమానులందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం ఈ టోర్నీ పాకిస్తాన్‌లో జరగబోతుండటమే. దీంతో ఈ టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్తాన్‌కు టీమిండియా వెళ్తుందా లేదా అన్నది అందరినీ ఆకర్షిస్తున్న అంశం. ఇదిలా ఉంటే, ఈ టోర్నీ కోసం ఇండియన్ టీమ్ ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ వెళ్లబోదని, టోర్నీనే మరో చోటుకు తరలిస్తామని గతేడాది ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, బీసీసీఐ సెక్రటరీ జై షా చెప్పడం దుమారం రేపింది. దీనిపై అప్పటి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా తీవ్రంగా స్పందించారు. అలా చేస్తే వరల్డ్ కప్‌ను తాము బాయ్ కాట్ చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం పీసీబీ ఛైర్మన్‌గా ఉన్న నజమ్ సేతీ తాజాగా ఏసీసీపై ఒత్తిడి తీసుకొచ్చి ఓ అత్యవసరం మీటింగ్ ఏర్పాటు చేయించారు. ఫిబ్రవరి 4వ తేదీన ఏసీసీ బహ్రెయిన్‌లో సమావేశం కానుంది. ఆసియా కప్ 2023 వేదికపై నిర్ణయం తీసుకోవడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందిస్తూ ఈ మధ్య తాను దుబాయ్ వెళ్లిన సమయంలో ఏసీసీ సభ్యులను ఈ అత్యవసర సమావేశానికి ఒప్పించినట్లు పీసీబీ చీఫ్ నజమ్ వెల్లడించారు.

Virat Kohli: చరిత్ర సృష్టించిన కోహ్లీ..ఆ ఘనత సాధించిన ఒకే ఒక్కడు

“ఏసీసీ బోర్డు ఫిబ్రవరి 4న బహ్రెయిన్‌లో సమావేశం కానుండటం చాలా పెద్ద ముందడుగు. ఈ మీటింగ్‌లో ఆసియా కప్‌కు సంబంధించిన అంశాలను చర్చిస్తాం. మార్చిలో ఐసీసీ మీటింగ్ కూడా జరగనుంది. ఏసీసీ సభ్యులతో నేను ఏం మాట్లాడాను, నేను ఏ నిర్ణయం తీసుకున్నాను అన్నది బయటపెట్టను. కానీ ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలు మాత్రం చాలా ముఖ్యం” అని నజమ్ చెప్పారు.గతేడాది శ్రీలంకలో జరగాల్సిన ఆసియా కప్ అనుకోని పరిస్థితుల్లో యూఏఈకి తరలించాల్సి వచ్చింది. ఈ ఏడాది ఈ టోర్నీకి పాక్ ఆతిథ్యమివ్వాల్సి ఉంది. అయితే దీనికోసం ఇండియన్ టీమ్ అక్కడికి వెళ్లే ప్రసక్తే లేదని బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పారు. అవసరమైతే పాక్ నుంచే టోర్నీని తరలిస్తామని కూడా అన్నారు.

Exit mobile version