Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ సమయం దగ్గర పడుతోంది. జూలై నెలలో ఒలింపిక్స్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. 2024 పారిస్ గేమ్స్ కోసం తాము ‘ఇంటిమసీ బ్యాన్’(సాన్నిహిత్యంగా మెలగడం) ఎత్తేసింది. శనివారం ఒలింపిక్ విలేజ్ డైరెక్టర్ లారెంట్ మిచాడ్ మాట్లాడుతూ.. 2024 గేమ్స్ కోసం బ్యాన్‌ని ఎత్తేస్తున్నట్లు తెలిపారు. 14,250 మంది అథ్లెట్లకు 3 లక్షల కండోమ్స్ అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.
Read Also: Manjummel Boys: తొలి ‘200 కోట్ల’ మలయాళ సినిమాగా చరిత్ర సృష్టించిన ‘మంజుమ్మేల్ బాయ్స్’
COVID-19 మహమ్మారి కారణంగా 2020 టోక్యో ఒలింపిక్స్ సమయంలో క్రీడాకారులు మధ్య శారీరక సంబంధాన్ని నిషేధించింది. సెక్స్‌తో సహా అథ్లెట్లు ఒకరితో ఒకరు శారీరక సంబంధాన్ని పరిమితం చేశారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ బ్యాన్ తీసుకువచ్చారు. పారిస్ ఒలింపిక్స్‌లో క్రీడాకారులున సౌకర్యవంతంగా ఉండేలా చూసుకుంటున్నామని మిచాడ్ స్కై న్యూస్‌తో చెప్పారు. ఈ ఏడాది జూలైలో జరగబోతున్న పారిస్ ఒలింపిక్స్‌కి 2.1 బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తు్న్నట్లు తెలుస్తోంది.
ఒలింపిక్స్‌లో కండోమ్ పంపణీ సంప్రదాయంగా కొనసాగుతోంది. 1988 సియోల్ ఒలింపిక్స్ నుంచి నిర్వాహకులు హెచ్ఐవీ ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించేందుకు ఇలా గర్భనిరోధక సాధనాలను అందిస్తున్నారు. 2020 ఒలింపిక్స్ సమయంలో 1.50 లక్షల కండోమ్స్ అందచేయబడ్డాయి.