Site icon NTV Telugu

ICC T20 World Cup 2024: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024కు అర్హత సాధించిన పపువా న్యూ గినియా

Wc 2024

Wc 2024

వచ్చే సంవత్సరం వెస్టిండీస్‌–అమెరికాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు పపువా న్యూ గినియా అర్హత సాధించింది. ఈస్ట్‌ ఏషియా పసిఫిక్‌ క్వాలిఫయర్స్‌ నుంచి పపువా న్యూ గినియా టీమ్ టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన జట్టుగా నిలిచింది. ఇవాళ (శుక్రవారం) ఎమిని పార్క్‌ వేదికగా పిలిప్పీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పపువా న్యూ గినియా వంద రన్స్ తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఫస్ట్ బ్యాటింగ్‌ చేసిన పపువా న్యూ గినియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 229 రన్స్ చేసింది. టోనీ యురా 61, ఆసద్‌ వాలా 59, చార్ల్స్‌ అమిని 53 పరుగులతో అద్భుమైన బ్యాటింగ్ చేశారు.

Read Also: Nama Nageshwar Rao : కేంద్రమంత్రికి బీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు లేఖ

అనంతరం బ్యాటింగ్‌ కు దిగిన పిలిప్పీన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 129 పరుగులే చేసింది. కెప్టెన్‌ డేనియల్‌ స్మిత్‌ 34 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. అర్ష్‌దీప్‌ శర్మ 22 పరుగులు చేశాడు. పపువా న్యూ గినియా బౌలర్లలో కబువా మోరియా రెండు వికెట్లు తీయగా.. జాన్‌ కరికో, హిరిహిరి తలో వికెట్‌ తీసుకున్నారు. ఇప్పటికే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024కి ఐర్లాండ్‌ అర్హత సాధించగా.. తాజాగా పపువా న్యూ గినియా కూడా ప్లేస్ ఖరారు చేసుకోవడంతో టీ20 వరల్డ్‌కప్‌ అర్హతకు సంబంధించి మరో ఐదు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అయితే.. అందులో ఒకటి అమెరికా క్వాలిఫయర్‌ నుంచి ఉండగా.. మిగతా నాలుగు బెర్తుల్లో రెండు ఆసియా నుంచి.. మరో రెండు ఆఫ్రికా క్వాలిఫయర్స్‌ నుంచి ప్రపంచకప్ కు అర్హత సాధించనున్నాయి. మొత్తంగా ఇప్పటికే రెండు పసికూన జట్లు అంతర్జాతీయ స్థాయిలో జరిగే ప్రపంచకప్ కు అర్హత సాధించాయి.

Read Also: Indigo Tail Strikes: ఇండిగోకు రూ.30 లక్షల జరిమానా.. ఎందుకంటే?

Exit mobile version